గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠభరితమైన కెరీర్‌కు స్పష్టమైన ఉదాహరణగా నిలిచాడు హర్ష సంఘవి . ప్రధాని నరేంద్ర మోడీ మరియు హోంమంత్రి అమిత్ షాలకు అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకోవడంతో కేవలం 40 సంవత్సరాల వయస్సులో, సంఘవి గుజరాత్ రాష్ట్ర హోంమంత్రి గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు . గతంలో అమిత్ షా మరియు ప్రదీప్‌సిన్హ్ జడేజా వంటి పార్టీ పెద్దలు ఈ పదవిని చేపట్టారు.
సంఘవి రాజకీయ జీవితం చాలా వేగంగా ఎదిగింది . గుజరాత్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేయడంతో అతడు కేంద్ర నాయకత్వం దృష్టిలో పడ్డాడు . దానితో ఆయన 36 సంవత్సరాల వయస్సులోనే గుజరాత్ యొక్క అతి పిన్న వయస్కుడైన మంత్రి అయ్యారు.
సంఘవిని మంత్రివర్గంలో చేర్చడం వెనుక ప్రధానమంత్రి మోడీ, హెచ్‌ఎం షా మరియు అప్పటి రాష్ట్ర చీఫ్ సి.ఆర్. పాటిల్ వంటి పార్టీ అధినేతల వ్యూహం కూడా ఉంది . 2015–16 లలో సూరత్ లో పాటిదార్ కోటా ఆందోళన నడుస్తుంది . ఆ సమయంలో సూరత్ లో తమ పార్టీ తరపున బలమైన నాయకత్వం ఉండాలని భావించి హర్ష సంఘవికి క్యాబినెట్లో కూడా స్థానం కల్పించారు
సూరత్ నాయకుడు హర్ష 2012లో 27 సంవత్సరాల వయసులో గుజరాత్ శాసనసభలోకి తొలిసారి ప్రవేశించి, మజురా నియోజకవర్గంలో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే అయ్యాడు.
మొట్టమొదటి ఎన్నికల్లోనే ఈ యువ నాయకుడు రికార్డ్ నెలకొల్పాడు . ఆ సంవత్సరం రాష్ట్రంలో నాల్గవ అత్యధిక ఓట్లు పొందిన వ్యక్తిగా నిలిచాడు.
2017 మరియు 2022 ఎన్నికలలో కూడా సంఘవి విజయవంతంగా తన స్థానాన్ని నిలుపుకున్నాడు, వజ్రాల గనులుగా పేరుబడ్డ సూరత్‌లో బీజేపీకి బలమైన కోటను నిర్మించాడు
2022లో, అతను 133,335 ఓట్లు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి పివిఎస్ శర్మపై 116,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించాడు.
లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో హర్ష ప్రజల ప్రశంసలు పొందాడు . రాజకీయ వర్గాల్లో అతడ్ని “గుజరాత్ అమిత్ షా” గా పిలుచుకుంటారు
తాజాగా మంత్రివర్గ విస్తరణలో హర్ష సంఘవికి హోమ్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కింది
