Home » ఎవరీ 19 ఏళ్ళ మహేష్ రేఖే ? ప్రాచీన దండక్రమ పారాయణం అంటే ఏంటి ?

ఎవరీ 19 ఏళ్ళ మహేష్ రేఖే ? ప్రాచీన దండక్రమ పారాయణం అంటే ఏంటి ?

Spread the love

దండక్రమ పారాయణం చేయడం అంటే మాములు మనుషులకు సాధ్యం కాదు .

అత్యంత సంక్లిష్టతతో కూడుకుని ఉంటుంది కాబట్టి గతంలో అనేకమంది పండితులు ఏకధాటిగా ఈ పారాయణం చేయాలని ప్రయత్నాలు చేసి సఫలం కాలేకపోయారు

ప్రాచీన వేద పారాయణం మరుగునపడిపోతుంది అనుకుంటున్న దశలో షుమారు 200 సంవత్సరాల తర్వాత ఓ 19 ఏళ్ళ కుర్రాడు ఈ ఘనతను సాధించాడు

అసలు ప్రాచీన దండక్రమ పారాయణం అంటే ఏంటి ?

వేద పారాయణాలకు కిరీటం వంటిది దండక్రమ పారాయణం

శుక్ల యజుర్వేదం నుంచి రెండు వేల శ్లోకాలతో నిండి ఉంటుంది
ఇది మాములు మంత్రం జపం మాదిరి ఉండదు

ఈ శ్లోకాలు పఠించాలంటే శబ్దం ,శ్వాస , జ్ఞాపకశక్తిల మీద గట్టి పట్టు ఉండాలి

పలకాల్సిన శ్లోకంలో శబ్ద తీవ్రత చెడకూడదు . లయ క్రమబద్ధంగా సాగాలి
శ్వాస మీద పూర్తి నియంత్రణ ఉండాలి
కొన్ని శ్లోకాలు పఠించేటప్పుడు ఊపిరి సైతం బిగపట్టాలి

ఇన్ని నియమాలతో రూపొందించబడింది కాబట్టి గతంలో చాలామంది పండితులు దండక్రమ పారాయణంలో విఫలం అయ్యారు

పైగా అన్ని శ్లోకాలను సాంప్రదాయకంగా పఠించాలే కానీ కాగితాలో , పుస్తకాలో చూసి చదవటానికి వీలు లేదు

రెండు శతాబ్దాలకు పూర్వం కేవలం ఇద్దరు ముగ్గురు పండితులు మాత్రమే దండక్రమ పారాయణం సంపూర్ణం చేయగలిగారని రికార్డులలో నమోదు కాబడింది

మళ్ళీ ఇన్నాళ్లకు 19 సంవత్సరాల మహేష్ రేఖే ఎటువంటి అంతరాయాలు లేకుండా ఆ ప్రక్రియని విజయవంతంగా పూర్తిచేసి రికార్డ్ నెలకొల్పాడు

ఎవరీ మహేష్ రేఖే ?

ఈ 19 ఏళ్ళ యువకుడు మహారాష్ట్రకు చెందిన అత్యంత గౌరవనీయ వేద పండితుడు వేద బ్రహ్మశ్రీ చంద్రకాంత్ రేఖే కుమారుడు

తండ్రి శృంగేరి పీఠంలో శుక్ల యజుర్వేద మధ్యందిన శాఖ యొక్క ప్రధాన పరిరక్షకుడిగా కొనసాగుతున్నారు

ఆయన కఠినమైన , శబ్ద నైపుణ్యం అవసరమైన వేద పారాయణ శైలులను ఎన్నో ఏళ్లుగా విద్యార్థులకు నేర్పిస్తూ కొన్ని వందలమంది వేద పండితులను తయారుచేసారు

ఈ క్రమంలో శుక్ల యజుర్వేదంలో అరుదైన , అత్యంత సంక్లిష్టమైన దండక్రమ పారాయణం అంతరించిపోతుందన్న విషయం ఆయన గమనించారు

వెంటనే కొడుక్కి తానే గురువై అంకిత భావం , క్రమశిక్షణతో రేయింబవళ్లు కస్టపడి ప్రాచీన విద్యను నేర్పించాడు

తండ్రి శిక్షణలో మహేష్ రేఖే దండక్రమ పారాయణంలో పట్టు సాధించాడు

శిక్షణ సమయంలోనే అతడి అంకిత భావం , శుక్ల యజుర్వేదంలో శ్లోకాలు అనర్గళంగా వల్లె వేయడం చూసిన సాటి పండితులే ఆశర్యపోయారు

మహామహులైన పండితులకు ఏళ్ళ తరబడి సాధ్యం కాని అభ్యాసం ఈ కుర్రవాడికి కొద్ది రోజుల్లోనే దక్కడం వెనుక గురువుగా నిలబడ్డ అతడి తండ్రి ప్రతిభ కూడా ఉందని ప్రశంసించారు

తండ్రి దగ్గర అభ్యాసం పూర్తి అయిన తర్వాత వేద పండితుల సమక్షములో పారాయణం చేసే బాధ్యతను మహేష్ రేఖే కి అప్పగించారు

50 రోజుల్లో మొత్తం పారాయణం పూర్తి చేసి రికార్డ్ నెలకొల్పాడు

అక్టోబర్ 2 న వారణాసిలోని వల్లభ పురం సాలిగ్రామ్ సంవేద్ విద్యాలయంలో మహేష్ రేఖే దండక్రమ పారాయణం మొదలుపెట్టాడు

సరిగ్గా యాభై రోజులకు నవంబర్ 30 న మొత్తం శ్లోకాలను పఠించడం పూర్తిచేసాడు

యాభై రోజుల్లో ఎలా పూర్తి చేసాడు ?

మహేష్ పారాయణం చేయడం కొన్ని వందలమంది వేద పండితులు గమనించసాగారు

ఎక్కడా ఉచ్చారణ దోషాలు బయటపడలేదు
మంత్రోచ్ఛారణలో శబ్ద ధ్వని , లయ క్రమ బద్దంగా సాగాయి

అత్యంత క్లిష్టమైన రెండు వేల శ్లోకాలను ఎటువంటి కాగితాలు చూడకుండా కేవలం జ్ఞాపకశక్తితో అనర్గళంగా పఠించాడు

ఎక్కడా అక్షరం పొల్లుపోకుండా అత్యంత ఖచ్చితత్వంతో , అత్యంత వేగంగా శ్లోకాలను పఠించిన అతని విధ్వత్తు చూసి వందలాది వేద పండితులు కరతాళ ధ్వనులు చేసారు

200 సంవత్సరాల తర్వాత అరుదైన ఘనత సాధించిన పండితుడిగా మహేష్ రేఖే పేరు రికార్డులలో నమోదు అయ్యింది

శృంగేరి జగద్గురు శంకరాచార్యులు వారు అతడికి ఆశీస్సులు అందించారు

వారణాసిలో అయితే సంబరాలు మిన్నంటాయి

19 ఏళ్ళ ఈ కుర్రాడ్ని వందలాదిమంది సాధువులు , పండితులు ఆశీర్వదించారు

అరుదైన రికార్డుని అధిగమించడంతో వేద సంస్థలు అతడికి ఐదు లక్షల రూపాయల విలువ చేసే స్వర్ణ కంకణం బహుకరించడంతో పాటు 1 ,11 ,116 రూపాయల నగదు బహుమతి కూడా అందించారు

వారణాసి వీధుల్లో మేళతాళాలతో , శంఖారావంతో , సాంప్రదాయ సంగీత వాయిద్యాలు మారుమోగుతుండగా షుమారు ఐదు వందలమందికి పైగా వేద పండితులు , విద్యార్థులు , సాధువులు వెంట రాగా కన్నుల పండువగా ఊరేగింపు కొనసాగింది

ప్రధాని నరేంద్ర మోడీ కూడా X వేదికగా స్పందిస్తూ ” అంతరించిపోతుందనుకున్న అత్యంత అరుదైన ప్రాచీన విద్యకు తిరిగి పూర్వ వైభవం సాధించిపెట్టిన మహేష్ రేఖేకు అభినందనలు ” అని తెలిపారు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!