డాక్టర్ పట్టా అందుకున్న దినసరి కూలీ కూతురు – ఫౌండేషన్ కు సాయం చేసిన యండమూరి
తూర్పు గోదావరి జిల్లా కొమరిగిరి గ్రామంలోని ఒక దినసరి కూలీకి నలుగురు సంతానం
వారిలో ఒక కూతురు పేరు షామిలి
ఈ అమ్మాయి చిన్నప్పట్నుంచి చదువుల్లో టాపర్
డాక్టర్ కావాలనేది ఆ అమ్మాయి లక్ష్యం
ఇంటర్లో కూడా మంచి మార్కులతో పాస్ అయినా కూడా ఆ అమ్మాయికి మెడిసిన్ కి వెళ్ళడానికి ఆర్థిక పరిస్థితి అనుకూలించని పరిస్థితుల్లో కడపకు చెందిన ఆర్తి ఫౌండేషన్ ఆ పిల్ల చదువు బాధ్యత భుజాన వేసుకుంది
ఈ సంగతి తెలిసిన ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ రెండేళ్ల క్రితం ఆర్తి ( విజయ ) ఫౌండేషన్ కు నాలుగు లక్షల రూపాయల విరాళం చెక్ రూపంలో అందించారు
తాజాగా ఆ దినసరి కూలీ కూతురు షామిలి డాక్టర్ షామిలి అయ్యిందని , ఆమె చదువుకు విరాళాల రూపంలో తోడ్పాటు అందించిన వీరేంద్రనాధ్ కు కృతజ్ఞతలు చెప్తూ ఆర్తి ఫౌండేషన్ వారు ఇంగ్లీష్ లో ఆయనకు ఉత్తరం రాసారు
ఈ సంతోషకర వార్తను యండమూరి వీరేంద్రనాధ్ సోషల్ మీడియా వేదికలో పంచుకున్నారు
ఆయన చేసిన సాయాన్ని మెచ్చుకుంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు
దిగువ ఆర్తి ఫౌండేషన్ వారు యండమూరి రాసిన ఉత్తరం తెలుగు అనువాదం తో ,
ప్రియమైన శ్రీ వీరేంద్రనాథ్ సర్,
డాక్టర్ రాయ్ షామిలి స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. షామిలి తన ముగ్గురు తోబుట్టువులతో తూర్పు గోదావరిలోని కొమరగిరి గ్రామంలో పెరిగారు. ఆమె తండ్రి దినసరి కూలీగా పనిచేస్తారు మరియు ఆమె తల్లి గృహిణి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే రోజుల నుండి, ఆమె డాక్టర్ కావాలని కలలు కన్నారు. ఆమెకు అడ్మిషన్ వచ్చింది, కానీ ₹4 లక్షల ఫీజు భారంగా మారింది. స్కాలర్‌షిప్ మరియు విద్యా రుణం ఆశలు ఫలించలేదు, ఆమె కుటుంబం ఇబ్బందుల్లో పడింది.
ఈ రోజు, ఆమె గర్వంగా డాక్టర్ రాయ్ షామిలి అనే బిరుదును మోస్తోంది, ఇది ఆమె పట్టుదలకు మరియు సకాలంలో మద్దతు ఇచ్చిన ప్రభావానికి నిదర్శనం.
మీలాంటి వ్యక్తుల నుండి మాకు లభించిన మద్దతు మరియు ప్రేమ కారణంగా మేము ఈ పేదలందరికీ మద్దతు ఇవ్వగలిగాము. ఆర్తి హోమ్‌లో భాగమైనందుకు ధన్యవాదాలు.
భవదీయులు
ధీర్షిత
స్పాన్సర్‌షిప్ కోఆర్డినేటర్
ఆర్తి ఫర్ గర్ల్స్, కడప
