నేటికి 𝟱𝟬 వసంతాలు పూర్తి చేసుకున్న చిత్రం
అన్నదమ్ముల అనుబంధం 04-07-1975
ఆల్ టైం ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సినిమా,
హిందీనాట వీరవిహారం చేసిన ‘యాదోంకి బారాత్’ సినిమాకు తెలుగు రీమేక్ ఈ “అన్నదమ్ముల అనుబంధం” యస్.డి. లాల్ గారు దర్శకుడు
పాటలు సూపర్ హిట్ .. ముఖ్యంగా గులాబి పువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే… పాట భలే ఉంటుంది , ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఈనాటి నయనాల విరిసే వసంతం ఇదేలే & అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది, ఇప్పటికీ ఈ పాటలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి
ఇలాంటి ఉర్రూతలూగించే పాటలతో మొదటిరన్ లో 32 కేంద్రాలలో విడుదలై విజయఢంకా మ్రోగిస్తూ భారీ కలెక్షన్లతో 19 కేంద్రాలలో అర్ధశతదినోత్సవాలు, 9 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడడం, నాలై నమదే(1975) పేరుతో తమిళంలో కూడా రీమేక్ చేసి యిదే తేదీన విడుదల చేసి అక్కడా విజయం సాధించడం, నందమూరి బాలకృష్ణ గారు తన పదిహేనేళ్ళ వయసులో పదవ తరగతి చదువుతూ యీ చిత్రంలో నటించి పలువురి ప్రశంసలు పొందడం విశేషం
చక్రవర్తి గారి సంగీతం హైలెట్, ఈ సినిమాకు మాటలు రాసింది గొల్లపూడి మారుతీరావు గారు , చాలా అద్భుతంగా రాశారు, ఇది రీమేకే అయినా దీన్నుంచి inspire అయ్యి తెలుగులో చాలా సినిమాలొచ్చాయి
అప్పట్లో ఇది ఒక హిట్ ఫార్ములా, ఇందులో మురళీ మోహన్ గారి నటన బాగుంటుంది, యన్టీఆర్ గారికి ఒక్క పాట కూడా లేదు ( డ్యూయెట్ లాంటివి లేవు) హిందీలో కూడా ధర్మేంద్ర గారికి పాట లేదు
యాదోంకి బారాత్ లో మిగిలిన వాళ్ళ నటన ఏమోగానీ ధర్మేంద్ర ది వన్ మ్యాన్ షో
ఆర్.డి. బర్మన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకుని తీరాలి , పాటల్ని అద్భుతంగా సృష్టించాడు
“చురా లియా హై తుమ్నే” పాటను హమ్ చేయని ప్రేక్షకుడు లేడు ఆరోజుల్లో, దాన్నే తెలుగులో ట్యూన్ చేశారు
యాదోంకి బారాత్ చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 1973 లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన ఐదవ చిత్రంగా నిలిచింది
ఈ చిత్ర దర్శకుడు నాసిర్ హుస్సేన్
ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఈ సినిమా చూసి ఉండకపోవచ్చు యూట్యూబ్ లో ఉంది, చూడనివాళ్ళు ఉంటే చూడండి, కనీసం పాటలైనా వినండి..!!
అన్నదమ్ముల అనుబంధం
విశ్వ టాకీస్