ప్రపంచ కుబేరుడి పెళ్లి అంటే ప్రత్యక్షం గా తిలకించిన అతిథులతో పాటు ప్రచార సాధనాల ద్వారా పరోక్షంగా తిలకించిన అందరికీ ఆసక్తే
ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తో తన వెడ్డింగ్ ఫోటో షూట్ ను ఆయన భార్య శాంచెజ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు
ప్రస్తుతం ఆ ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి
తన పెళ్లివేడుకల కోసం జెఫ్ బెజోస్ ఏకంగా ఒక ఐలాండ్ నే బుక్ చేసాడు
తన కాబోయే భార్యకు 3. 5 కోట్లతో డైమండ్ ఉంగరం చేయించాడు
ఇటలీలోని వెనిస్ నగరానికి దగ్గర్లో లాగూన్ ఐలాండ్ లో జెఫ్ బెజోస్ (61) శాంచెజ్ (55) పెళ్లివేడుకలు అట్టహాసంగా జరిగాయి
నిజానికి జెఫ్ బెజోస్ కి సాంచెజ్ కి మధ్య 2018 నుంచి డేటింగ్ నడుస్తుంది
2019 లో జెఫ్ బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్ కు విడాకులు ఇచ్చి 25 సంవత్సరాల వైవాహిక బంధానికి స్వస్తి పలికాడు
జెఫ్ బెజోస్ కు మొదటి భార్య ద్వారా నలుగురు సంతానం కలిగారు
శాంచెజ్ కు మొదటి భర్త ద్వారా ముగ్గురు సంతానం కలిగారు
తాజాగా జెఫ్ బెజోస్ మరియు సాంచెజ్ లు శుక్రవారం జరిగిన పెళ్లివేడుకలతో దంపతులు అయ్యారు
ప్రపంచ కుబేరుడి పెళ్లి అంటే అట్టహాసాలు ఉంటాయి కదా
బెజోస్ పెళ్ళికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవంకా భర్తతో కలిసి రాగా .. జోర్దాన్ రాణి తో పాటు ఇతర ప్రముఖులు తరలి వచ్చారు
పెళ్లి వేడుకలకు 95 జెట్ విమానాల్లోనూ .. 5 వేల కార్లలోనూ అతిధులు తరలి వచ్చారు
ఏకంగా లాగూన్ ఐలాండ్ మొత్తం అతిధిలతో నిండిపోయింది
పర్యావరణ రహితంగా ఉన్న లాగూన్ ఐలాండ్ వాహనాల పొగ .. దుమ్ము ధూళితో ఒక్కరోజులో కాలుష్య కారకంగా మారడంతో స్థానిక పర్యావరణకారులు నిరసన ప్రదర్శనలు కూడా చేసారు
ఏదిఏమైనా ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ వివాహం ఊహించిన విధంగానే అంగరంగ వైభవంగా జరిగింది !