సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం అరచేతిలోకి వచ్చింది .. ఏ మూల ఏ సంఘటన జరిగిన క్షణాల్లో సమాచారం చేరిపోతుంది
దీని పుణ్యమా అని రాత్రికి రాత్రి కొందరు సెలెబ్రిటీలు అయిపోతున్నారు
పూసలు అమ్ముకునే అమ్మాయి అలా రాత్రికి రాత్రి సినీ నటి అయిపోయింది
ఇబ్బందుల్లో ఉన్నవాళ్లు కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు
అందుకే చాలామంది బతికి చెడ్డవాళ్ళు తమ కష్టాలను సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు
అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ క్యారక్టర్ నటి వాసుకి ( పాకీజా ఫ్రేమ్ ) ఏడుస్తూ తన కష్టాలను ఒక వీడియోలో చెప్పి సోషల్ మీడియాలో ఉంచింది
ఆ వీడియోలో ఆమె ఏమన్నారంటే ,
తన ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని .. అయినవాళ్లు ఎవరూ లేకపోవడంతో తమిళనాడు తన సొంత ఊరిలో ఒంటరి జీవితం గడుపుతున్నానని .. గతంలో చిరంజీవి , నాగబాబు అన్నయ్యలు సాయం చేయబట్టి కొంతకాలం నెట్టుకొచ్చానని .. ఇప్పుడు మళ్ళీ తన ఆర్థిక పరిస్థితి మొదటికి వచ్చిందని పూట గడవటం కష్టంగా ఉందని ఏడుస్తూ చెప్పింది
అందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను కలిసి తనకు పెన్షన్ సౌకర్యం ఇప్పించవలసిందిగా వేడుకుందామని వెళ్తే సెక్యూరిటీ ఇబ్బందుల దృష్ట్యా తాను వాళ్ళను కలవలేకపోయానని .. ఎవరైనా సాయం చేసి తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు
అయితే వాసుకీ విడుదల చేసిన ఈ వీడియో పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన వాసుకిని పిలిపించి రెండు లక్షల ఆర్థిక సాయాన్ని పార్టీ విప్ ద్వారా ఆమెకు ఇప్పించారు
తన కష్టాలకు వెంటనే స్పందించి ఆదుకున్న పవన్ కళ్యాణ్ తనకు దేవుడి లెక్క అని ఆమె కన్నీటి పర్యంతం అవుతూ చెప్పింది
ఏది ఏమైతేనేమి వాసుకి కష్టాలకు తక్షణం కొంత రిలీఫ్ దొరికింది
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తక్షణ స్పందనకు పలువురు నెటిజన్లు హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు !!