విజయవాడ వేదికగా యూరాలజికల్ ఎక్సలెన్స్‌లో కీలక మైలురాయి సుజికాన్ – 2025

Spread the love

విజయవాడ, 10 జూలై 2025: యూరాలజికల్ ఎక్సలెన్స్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయే సుజికాన్-2025 నిర్వహణకు నగరం వేదిక కానుంది

ఈ నెల 11 నుండి 13 వరకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్‌లో 36వ సదరన్ యూరాలజిస్ట్స్ అసోసియేషన్ వార్షిక సదస్సు (సుజికాన్-2025) జరగనుంది

ప్రశాంత్ హాస్పిటల్ కేంద్రంగా విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనైటో యూరినరీ సర్జన్స్ నిర్వహించే ఈ కార్యక్రమం ఏఎస్యు చరిత్రలో అతిపెద్ద జోనల్ యూరాలజీ సమావేశం కానుంది

సుజికాన్-2025 వివరాలను తెలియజేసేందుకు ఎంజీరోడ్డులోని ప్రశాంత్ హాస్పిటల్లో గురువారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు

ఈ సమావేశంలో సుజికాన్-2025 నిర్వాహక బృందం సభ్యులు పలు కీలక అంశాలను వెల్లడించారు

“దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1000 మంది యూరాలజిస్టులు, ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. తాజా ఆవిష్కరణలను ప్రదర్శిస్తూ 75 ట్రేడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. ప్రధాన యూరాలజికల్ సబ్‌ స్పెషాలిటీల్లో 50కి పైగా శాస్త్రీయ సెషన్‌ల నిర్వహించబడతాయి. మాస్టర్‌ క్లాస్‌లు, ఆచరణాత్మక అభ్యాసంతో సహా 8 కేంద్రీకృత ఉప స్పెషాలిటీ సమావేశాలు జరుగుతాయి. సాంస్కృతిక ప్రదర్శనలు, క్యూరేటెడ్ కుటుంబ అనుభవాలు కొనసాగుతాయి.” అని వివరించారు.

సుజికాన్-2025 ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ ధీరజ్ కాసరనేని మాట్లాడుతూ, “ఈ సదస్సును నిర్వహించడం నాకు చాలా వ్యక్తిగతమైనది. నా తండ్రి 2004లో ఇదే సమావేశాన్ని నిర్వహించారు. రెండు దశాబ్దాల తరువాత, ఇప్పుడు పూర్తి స్థాయి రోబోటిక్ సర్జరీ, లేజర్ టెక్నాలజీ, అధునాతన యూరాలజికల్ కేర్‌ను అందించే నగరంలో ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గౌరవంగా ఉంది.” అని పేర్కొన్నారు.

ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ సి.వి. సతీష్ కుమార్ మాట్లాడుతూ” సమిష్టి కృషి, సమన్వయంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని” అన్నారు

కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని వనరులు, సహాయక యంత్రాంగం సిద్ధంగా ఉందని కోశాధికారి డాక్టర్ జి. అజయ్ కుమార్ తెలిపారు.

జాతీయ స్థాయి నిపుణులు, ప్రపంచ స్థాయి శస్త్రచికిత్సల సమగ్ర వివరాలతో ఈ కార్యక్రమం రూపొందించబడిందని సైంటిఫిక్ కమిటీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ పి. శ్రీమన్నారాయణ తెలియజేశారు.

సుజికాన్-2025ను నిర్వహించడం వాగస్ కు గర్వకారణమని సోగస్ ఏపీ, తెలంగాణ కార్యదర్శి డాక్టర్ జి. శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆధునిక విజ్ఞానాన్ని విద్యా ఆత్మీయ ఆతిథ్యంతో మిళితం చేసే సమావేశాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

వాగస్ అధ్యక్షుడు డాక్టర్ జి. రవిశంకర్ మాట్లాడుతూ “నగరంలో సుజికాన్-2025ను నిర్వహించడం గర్వంగా ఉందని” అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసిన నిర్వాహక బృందానికి అయిన అభినందనలు తెలియజేశారు.

ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్ సుజికాన్-2025కు ఆతిథ్యమిస్తోన్న డాక్టర్ కె. ప్రశాంత్ కుమార్ కాసరనేని మాట్లాడుతూ, “ఎండోస్కోపీ నుండి పూర్తి స్థాయి రోబోటిక్, పునర్నిర్మాణ శస్త్రచికిత్సల వరకు యూరాలజీలో విజయవాడ ప్రయాణం అద్భుతంగా సాగుతోందని” అన్నారు. ఈ ఘనతలను ఈ సుజికాన్-2025 ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

1986లో నగరంలో నిర్వహించిన యుసికాన్ సదస్సుకు అధ్యక్షత వహించిన డాక్టర్ సి. నాగేశ్వరరావు సుజికాన్-2025కు చీఫ్ ప్యాట్రన్ గా కీలక భూమిక పోషిస్తున్నారు.

విజ్ఞాన కార్యక్రమాలతో పాటు, సుజికాన్-2025లో లెగసీ టన్నెల్, పుణ్యక్షేత దర్శనం, ఎకో పార్క్ ట్రెక్, బీపీహెచ్ అవేర్‌నెస్ వాకథాన్, ఉత్సాహభరితమైన క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారు. అభ్యాసం, వారసత్వం, వేడుకల పరిపూర్ణ సమ్మేళనాన్ని ఈ సదస్సు ప్రతిబింబిస్తుంది.

ఈ సదస్సు ఈ నెల 11న ప్రారంభమై వారాంతం వరకు కొనసాగుతుందని నిర్వాహక బృందం తెలియజేసింది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!