భారత జాతీయ రాజకీయాల్లో యోగి ప్రకాశిస్తాడా ?
బీజీపీలో నరేంద్ర మోదీ తర్వాత నెంబర్ టూ ప్లేసులో అమిత్ షా పేరు ఉంటుంది అని నిన్నటిదాకా మనకు తెలిసిన విషయమే
గుజరాతీ నేతలు మోదీ , షాల కాంబో బీజేపీకి చాలా విజయాలను సొంతం చేసి పెట్టింది
ఇద్దరు నేతలు గుజరాత్ క్యాబినెట్లో ఒకరు ముఖ్యమంత్రిగా మరొకరు క్యాబినెట్ మంత్రిగా కలిసిపనిచేసారు
తిరిగి అదే ఇద్దరు నేతలు కేంద్ర క్యాబినెట్లో కూడా ఒకరు పీఎం గా మరొకరు క్యాబినెట్ మినిష్టర్ గా కలిసిపనిచేస్తున్నారు
కొన్ని దశాబ్దాలుగా ఈ పెయిర్ పార్టీలో తిరుగులేని నాయకత్వం తీసుకుంది
పార్టీపరంగా కానీ పాలనాపరంగా కానీ తీసుకునే నిర్ణయాలలో వీరిద్దరి పాత్రే కీలకంగా ఉంటుంది
బీజేపీలో ఇతర నాయకత్వం ఉన్నా అది నామమాత్రమే అన్న సంగతి అందరికీ తెలుసు
ఇప్పుడు మోదీ మూడోసారి ప్రధాని పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు
తిరిగి ఎన్నికలకు 2029 వరకు గడువు ఉంది
2029 నాటికి తన భవిష్యత్ ప్రణాళికలు ఏంటో మోదీ ఇంతవరకు బయటికి చెప్పలేదు
కానీ ఈ మధ్య అహ్మదాబాద్ లో జరిగిన ఓ సదస్సులో అమిత్ షా తన భవిష్యత్ ప్రణాళికలను వివరించారు
భవిష్యత్తులో తాను రాజకీయాల నుంచి రిటైర్ అయి వ్యవసాయం చేసుకునే ఆలోచన ఉందని చెప్పారు
అంతేకాదు వేదాలు ,ఉపనిషత్తులు చదువుకుంటూ శేష జీవితాన్ని ఆధ్యాత్మికత సేవలో గడపాలని అనుకుంటున్నట్టు చెప్పారు
ఈ ప్రకటనతో అమిత్ షా తన మనసులోని ఆంతరంగాన్ని బహిరంగంగానే ఆవిష్కరించారు
దీనితో భవిష్యత్తులో షా తర్వాత నెంబర్ టూ ఎవరనే చర్చ ఇప్పటినుంచే పార్టీ వర్గాల్లో మొదలైంది
ఈ క్రమంలో యూపీ ముఖ్యమంత్రి యోగి పేరు ఎక్కువగా వినిపిస్తుంది
ఆదిత్య నాధ్ దాస్ యోగికి పార్టీలోనూ , ప్రజల్లోనూ ఉన్న ఫాలోయింగ్ తక్కువేమీ కాదు
యూపీలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్నాడు
నూటికి నూరు శాతం హిందుత్వ వాది
నరేంద్ర మోదీకి అత్యంత విశ్వాస పాత్రుడు
ఈ అర్హతలన్నీ 2029 లో యోగిని జాతీయ రాజకీయాల్లోకి తీసుకువస్తాయి
యోగి కూడా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు
ఆ అవకాశాలన్నీ అమిత్ షా రిటైర్మెంట్ తో యోగికి కలిసి వస్తాయి
ఒకానొక దశలో బీజేపీ తరపున భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా యోగి పేరు కూడా బయటికి వచ్చింది
ఏదేమైనా మోదీ , అమిత్ షా ల తర్వాత బీజేపీ తరపున దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం యోగికి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి !
పరేష్ తుర్లపాటి