అవును .. చాట్ జిపిటిని అమాంతం వెనక్కి నెట్టింది ఒక భారతీయుడి మేధస్సు !
ఆ మధ్య కృత్రిమ మేధస్సు ( ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ) లో చాట్ జిపిటి ప్రవేశపెట్టి అమెరికా డిజిటల్ రంగంలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది
AI సాయంతో ఎన్నో అద్భుతాలను సాధిస్తున్నారు
దీనివల్ల అతి తక్కువ ఖర్చుతో , అతి తక్కువ మానవ వనరులతో ,అతి తక్కువ సమయంలో సాంకేతిక రంగంలో అద్భుత ఫలితాలు సాదించటానికి సాధ్యపడింది
కొద్దికాలానికే అమెరికా చాట్ జిపిటికి పోటీగా చైనా డీప్ సీక్ ను తీసుకువచ్చింది
చాట్ జిపిటితో పోలిస్తే అతి తక్కువ వ్యయంతో డీప్ సీక్ ను రూపొందించింది చైనా
ఇప్పుడు 31 ఏళ్ళ భారతీయ యువకుడు అరవింద్ శ్రీనివాస్ చాట్ జిపిటికి పోటీగా perplexity AI పేరుతొ మరో అద్భుతాన్ని సృష్టించాడు
అరవింద్ శ్రీనివాస్ తయారుచేసిన AI యెంత అద్భుతాలు సృష్టిస్తుంది అంటే ఆపిల్ యాప్ స్టోర్ లో చాట్ జిపిటిని వెనక్కి నెట్టేసి నెంబర్ వన్ స్థానంలోకి వచ్చింది
perflexity AI కి ఏడాదికి 17 వేలు సబ్స్క్రిప్షన్స్ చెల్లించాల్సి ఉండగా ఎయిర్ టెల్ తమ యూజర్లకు ఉచితంగా అందిస్తుంది
దీంతో ఆ యాప్ డౌన్లోడ్స్ అమాంతంగా పెరిగాయి
1994 లో చెన్నైలో పుట్టిన అరవింద్ శ్రీనివాస్ మద్రాస్ ఐఐటి లోనూ , కాలిఫోర్నియా యూనివర్సిటీలోనూ చదువుకున్నాడు
ప్రభుత్వాలు ప్రోత్సాహాలు ఇవ్వాలే కానీ భారత్ లో టాలెంట్ కు కొదవ లేదు
మన మేధస్సునే పాశ్చాత్య దేశాలు వాడుకుని ఆదాయం పెంచుకోవడంతో పాటు ఆ రంగంలో మానవ వనరుల ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకుంటున్నారు
చాట్ జిపిటిని కూడా వెనక్కి నెట్టి సరికొత్త AI ని ఆవిష్కరించిన అరవింద్ శ్రీనివాస్ కు అభినందనలు !