Home » అమ్రిష్ పురి హీరో కంటే ఒక రూపాయి ఎక్కువ డిమాండ్ చేసేవాడు .. ఎందుకో తెలుసా ?

అమ్రిష్ పురి హీరో కంటే ఒక రూపాయి ఎక్కువ డిమాండ్ చేసేవాడు .. ఎందుకో తెలుసా ?

Spread the love

బాలీవుడ్ లో హీరోలకన్నా వాళ్ళ పర్సనల్ స్టాఫ్ ఖర్చు విపరీతంగా ఉంటుంది .. ఒక్కోసారి నిర్మాతలకు ఈ అదనపు భారం తలపోటు తెప్పిస్తుంది .

హీరోగారి పెర్సనల్ స్టాఫ్ బడ్జెట్ వాళ్ళే భరించుకోవాలి అని నేరుగా ఆ హీరోలకే చెప్పే దైర్యం లేక చాలామంది నిర్మాతలు మౌనంగా ఆ ఖర్చు భరిస్తున్నారు .

ప్రస్తుతం ఈ అంశం మీద హిందీ చిత్ర పరిశ్రమలో చర్చ నడుస్తుంది .

ప్రముఖ నటుడు సౌరభ్ శుక్లా కూడా ఈ అంశంపై స్పందిస్తూ , దివంగత దిగ్గజ నటుడు అమ్రిష్ పూరిని ఉదాహరణగా తీసుకుని, తాను ఒకే మేకప్ మ్యాన్‌తో ఎలా ప్రయాణించాడో మరియు తన పర్సనల్ స్టాఫ్ కోసం నిర్మాతల మీద భారం పడకుండా చాలా తక్కువ మొత్తాన్ని ఎలా ఖర్చు చేశాడో చెప్పాడు

2001 బ్లాక్‌బస్టర్ నాయక్: ది రియల్ హీరోలో అమ్రిష్‌తో కలిసి పనిచేసినట్లు సౌరభ్ గుర్తుచేసుకున్నాడు. అమ్రిష్ స్టార్ ఆలోచనలకు పూర్తిగా వ్యతిరేకమని , ఆయన నిర్మాతల నటుడని చెప్పాడు

అంత పెద్ద నటుడైనా అమ్రిష్ సింపుల్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేవాడని సౌరభ్ చెప్పాడు

పని పట్ల అమ్రిష్ విధానం మరియు ఖర్చు ఆదా గురించి మాట్లాడుతూ, ” అమ్రిష్ పురి ఖర్చు విషయంలో చాలా కాలుక్యులేటెడ్ గా ఉండేవాడు . నిర్మాతల మీద అనవసరమైన ఖర్చును మోపేవాడు కాదు . అలా అని నటుడిగా తనను తాను ఏ రోజూ తగ్గించుకోలేదు . తన సినిమాలో హీరోకంటే ఒక రూపాయి ఎక్కువ డిమాండ్ చేసేవాడు .అదీ అమ్రిష్ కి తన నటన మీద ఉన్న నమ్మకం”

అలా అని అమ్రిష్ దుబారా మనిషి కాదు . తన సొంత స్టాఫ్ ఖర్చులను నిర్మాత మీద మోపేవాడు కాదు . అతనికి సెక్రటరీ లేడు మరియు డ్రైవర్ కూడా లేడు. ఒక్క మేకప్ మ్యాన్ మాత్రమే ఉన్నాడు

ఒకసారి నేను ఆయన్ని అడిగాను” మీరు అంత పెద్ద నటులు కదా .. ‘మీకు కనీస స్టాఫ్ కూడా లేరా?’ ” అని

దానికి ఆయన ” సినిమాల్లో నేను సంపాదించే ప్రతి పైసా నా కష్టార్జితం . ఆడంబరాలకు పోయి డబ్బులు తగలెయ్యడం నాకిష్టం లేదు . అలా అని నా నిర్మాతల మీద భారం మోపడం కూడా నాకిష్టం లేదు ..అందుకే స్టూడియోలకు వచ్చేటప్పుడు నిర్మాత కారులో బదులు నా కారును నేనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను ” అని చెప్పాడాయన

డ్రైవరు , మేకప్ మ్యాన్ , న్యూట్రిషియన్ల ఖర్చులు కూడా నిర్మాతల మీద మోపే నేటి హీరోలు అమ్రిష్ పురి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని బాలీవుడ్ నిర్మాతలు అంటున్నారు


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *