ఆ హీరోని ఘాఢంగా ప్రేమిస్తే రెండేళ్ల తర్వాత ఏం చెప్పాడో తెలుసా ? – గులాబీ హీరోయిన్ మహేశ్వరి
శ్రీదేవికి చెల్లెలు వరుస అయ్యే మహేశ్వరి 90 వ దశకంలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు
ఆమెకు 17 ఏళ్ళ వయసులోనే భారతీ రాజా దర్శకత్వంలో ఓ తమిళ చిత్రంలో నటించి వెండి తెర మీద ప్రత్యక్షము అయ్యారు
ఆ తర్వాత అమ్మాయి కాపురం ద్వారా తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చారు మహేశ్వరి
అయితే కృష్ణవంశీ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి సరసన హీరోయిన్ గా నటించిన గులాబీ ఆమెకు బ్రేక్ ఇచ్చింది
ఈ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా మహేశ్వరి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది
అనంతరం కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమె కెరీర్ లో గులాబీ మూవీ బెస్ట్ గా నిలిచింది
చివరిసారిగా తిరుమల తిరుపతి వేంకటేశ మూవీ తర్వాత ఆమె సినిమాల్లో నటించలేదు
2008 లో గుంటూరుకు చెందిన జయకృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు
అయితే ఇటీవల జగపతి బాబు హోస్ట్ గా నిర్వహిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్లో మహేశ్వరి పాల్గొని పెళ్లికాక ముందు జరిగిన తన సీక్రెట్ లవ్ స్టోరీని రివీల్ చేసారు
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ను తాను అమితంగా ఇష్టపడేదానినని చెప్పింది

ఆయనతో కలిసి చేసింది రెండు సినిమాలే అయినా అజిత్ అంటే పిచ్చి ప్రేమ ఏర్పడింది
అందులో ఒక సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో పూర్తి కావడానికి రెండేళ్లు పట్టింది
ఆ సినిమా షూటింగ్ ఆఖరి రోజున ఇకపై ఆయన్ని కలవడం కుదరదని బాధ పడుతూ ఓ మూల కూర్చున్నా
ఎలాగైనా ఈరోజు తన ప్రేమని ఆయనకు తెలియచేయాలని నిశ్చయించుకున్నా
ఈ లోగా అజితే నా దగ్గరికి వచ్చి ‘ ఎందుకలా డల్ గా ఉన్నావ్ ? నీకేం సాయం కావాలన్నా , ఎనీ టైం నన్ను కలువు . నువ్ నా చెల్లెలు లాంటి దానివి ‘ అనడంతో షాక్ అయ్యా
అజిత్ అంత మాట అన్నాక ఇంకేం చెప్తా
అలా రియల్ లైఫ్ లో నా లవ్ స్టోరీకి బ్రేక్ పడింది అని చెప్పుకొచ్చింది మహేశ్వరి
