బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు కేవలం అమితాబ్ వల్లనే బ్లాక్ బస్టర్ హిట్ అయినవి కూడా ఉన్నాయి
అటువంటి అమితాబ్ బచ్చన్ కూడా ఒకానొక సమయంలో తనకు ఎవరూ సినిమాల్లో అవకాశం ఇవ్వరేమో అని భయపడ్డాడు . ఆ భయంతో అమితాబ్ నిర్మాతగా కూడా మారుదామని ప్లాన్ చేసుకున్నాడు.
ఇదంతా అతను ‘అభిమాన్’ చేయడానికి ముందు జరిగింది. ఓ కార్యక్రమంలో విక్కీ లాల్వానీతో జరిగిన సంభాషణలో హనీఫ్ జవేరి ఈ విషయాలు రివీల్ చేసాడు
“ఒకానొక సమయంలో అమితాబ్ బచ్చన్ తనను చాలా సినిమాల నుండి తొలగిస్తున్నట్లు భావించాడు.
చాలామంది నిర్మాతలు అమితాబ్ కాల్షీట్లు అడగడం మానేసి రోజులు గడుస్తున్నాయి . ఒకవేళ తనకు బయటి నిర్మాతల నుంచి సినిమా అవకాశాలు రాకపోయినా సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిద్దామని ప్లాన్ చేసుకున్నాడు . అందువల్ల అతను నిర్మాతగా మారాలనుకున్నాడు” అని వెల్లడించాడు.
హనీఫ్ మాట్లాడుతూ , “‘దునియా కా మేళా’ వంటి సినిమాల నుండి అప్పటికే అతన్ని తొలగించారు” అని చెప్పాడు. కొంతమంది చిత్రనిర్మాతలు బిగ్ బితో సినిమాలు ఒప్పందం కుదుర్చుకున్నారు కానీ ఆ సినిమాలు ఏవీ సెట్స్ మీదకు వెళ్ళలేదని” ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, అలాంటి పరిస్థితికి దారితీసిన కారణాలను వివరిస్తూ హనీఫ్, అప్పట్లో “‘7 హిందూస్థానీ’ వంటి అమితాబ్ బచ్చన్ తొలి సినిమాలు పరాజయం పాలవ్వడం కూడా ఒక కారణమని ” అని చెప్పాడు
అందుకే ఒక నిర్మాతగా తాను కూడా సొంత బ్యానర్ తెరవాలని అమితాబ్ బచ్చన్ భావించాడు. ఒకవేళ బయటి ప్రపంచం నుండి సినిమా అవకాశాలు రాకపోతే , తన సొంత నిర్మాణంలో పనిచేయడానికే బిగ్ బి ఈ నిర్ణయం తీసుకున్నాడని హనీఫ్ చెప్పారు
అమితాబ్ బచ్చన్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి తెలుసుకున్న ‘గుడ్డి’ దర్శకుడు హృషికేష్ ముఖర్జీ అతన్ని వారించాడు . ఒకవేళ మీరు కనుక నిర్మాతగా మారితే బయటి నిర్మాతలు ఎవరూ మీకు నటుడిగా అవకాశాలు ఇవ్వరని ఆయన బిగ్ బి కి సలహా ఇచ్చాడు
“ ఇండస్ట్రీలో నటుడిగా మారిన నిర్మాతలకు ఇతరులు సినిమాలు ఇవ్వడం లేదు . ఉదాహరణకు దేవానంద్ లేదా మనోజ్ కుమార్ లాంటి వాళ్ళను తీసుకోండి” అని ఆయన చెప్పడంతో అమితాబ్ పునరాలోచనలో పడ్డాడు
అందుకే, అమితాబ్ బచ్చన్ సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మించాలని అనుకున్నాడు కానీ ఎక్కడా తన పేరు లేకుండా జాగ్రత్త పడ్డాడు నిర్మాణ బాధ్యతలు అన్నీ సుశీల కామత్ మరియు పవన్ కుమార్ లకు అప్పచెప్పాడు
ఇంతకీ వీరెవరో తెలుసా ?
సుశీల కామత జయ బచ్చన్ కార్యదర్శి, మరియు పవన్ కుమార్ అమితాబ్ బచ్చన్ అంతర్గత వ్యవహారాలను చూసే వ్యక్తి
అదీ సంగతి
