Home » ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అమితాబ్ బచ్చన్ !

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అమితాబ్ బచ్చన్ !

Spread the love

బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని గోఘాట్‌లోని అగై అనే గ్రామంలో, కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) 16వ పోటీదారు జయంత దులే సోదరి 22 ఏళ్ల శిఖాకి ఆమె కోరుకున్న గౌరవం దక్కింది .

ఇంట్లో వాష్ రూమ్ సౌకర్యం లేకపోవడంతో సంవత్సరాలుగా ఆమె గ్రామ చెరువులో స్నానం చేస్తూ ఇబ్బంది పడుతుంది

దులే ఇంటికి బాత్రూమ్ లేకపోవడంతో అతని తల్లి రూప మరియు సోదరి కూడా బహిరంగ ప్రదేశంలోనే స్నానం చేయాల్సి వచ్చేది

ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడ్డ రూపా మరియు సిఖా రోజువారీ కష్టాలు చివరకు ముగిశాయి. ఎందుకంటే వారికి ఇప్పుడు ఇంట్లో వాష్‌రూమ్ ఉంది. దాని గోడపై “మిస్టర్ అమితాబ్ బచ్చన్ బహుమతిగా ఇచ్చారు” అనే శిలా ఫలకం కూడా పెట్టించుకున్నారు

అమితాబ్ బచ్చన్ ఏంటి ? దులే ఇంట్లో వాష్ రూమ్ కి ఆయన పేరు పెట్టుకోవడం ఏంటి ? అని ఆశర్యపోతున్నారా ?
అందుకో కారణం ఉంది

2024లో KBC సీజన్ 16 మొదటి వారం విజేతగా నిలిచిన డ్యూలే – క్విజ్ పోటీ ఎపిసోడ్‌లో తన హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తో ఈ కష్టాన్ని పంచుకున్నాడు .

తన ఇంట్లో వాష్ రూమ్ సౌకర్యం లేకపోవడంతో తల్లి , చెల్లి స్నానం కోసం చెరువుకి వెళ్లాల్సి వస్తుందని అమితాబ్ తో తన గోడు వెళ్లబోసుకున్నాడు

అతడి పరిస్థితి తెలుసుకున్న అమితాబ్ బచ్చన్ కు జాలేసింది . ఆ ఇంటికి తన సొంత ఖర్చులతో వాష్ రూమ్ నిర్మిస్తానని అక్కడే అమితాబ్ హామీ ఇచ్చాడు . చెప్పినట్టుగానే అమితాబ్ బచ్చన్ డ్యూలే కుటుంబానికి బాత్రూమ్ నిర్మిస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు.

భారతదేశంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాల్సిన అవసరాన్ని హైలైట్ చేస్తూ గతంలో బాలీవుడ్ ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ వంటి చిత్రాలను నిర్మించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి సమస్యలు ఇంకా ఉన్నాయని దులే ఉదంతంతో అమితాబ్ కు కూడా తెలిసింది

అందుకే “కేబీసీ ఆట ఫలితం ఏదైనా సరే నా స్వంత ఖర్చుతో మీ ఇంట్లో బాత్రూమ్ నిర్మించబడుతుంది ” అని అక్కడే బచ్చన్ అతనికి హామీ ఇచ్చారు.

రియాలిటీ గేమ్ షో నుండి డ్యూలీ రూ. 12.5 లక్షల బహుమతిని అందుకున్నాడు.

అయినా సరే అమితాబ్ బచ్చన్ అతడిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు . ఈ అక్టోబర్‌లో ‘బిగ్ బి’ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుని దులే ఖాతాకు రూ. 2 లక్షలు పంపాడు.

ఈ ఉదారమైన సహకారంతో దులే తన ఇంట్లో బాత్రూమ్ నిర్మాణాన్ని పూర్తిచేసి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు

అతన సోదరి శిఖా దీనిని మహిళల గౌరవాన్ని కాపాడటానికి అమితాబ్ చేసిన గొప్ప సాయంగా వర్ణించింది . “నేను బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం నుండి బెంగాలీలో నా మాస్టర్స్ పూర్తి చేసాను మరియు D.El.Ed (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) కోర్సులో నా అడ్మిషన్ పొందడానికి వేచి ఉన్నాను. నా వయస్సులో ఉన్న ఒక మహిళ ఎవరికీ కనిపించకుండా గ్రామ చెరువులో క్రమం తప్పకుండా స్నానం చేయడం చాలా ఇబ్బందికరంగా ఉండేది ” అని ఆమె గుర్తుచేసుకుంది.

“మా కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి అమితాబ్ బచ్చన్ చేసిన ఈ వ్యక్తిగత సాయం మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని చూపిస్తుంది. ఆయన చేసిన సాయం కేవలం టాయిలెట్ నిర్మించడం మాత్రమే కాదు; ఇది మా గౌరవాన్ని కూడా కాపాడారు . మేము ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాము” అని ఆమె రెండు చేతులు జోడించి చెప్పింది

. “అమితాబ్ బచ్చన్‌ను కలవడం నా కల, అది నిజమైంది. ఆయన మా కుటుంబం కోసం చేసింది నా కలకన్నా మించినది” అని దులే అన్నారు.

అతని తండ్రి, భాదు దులే కూడా అమితాబ్ కి తన కృతజ్ఞతలు తెలిపారు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *