ఖుదాగావా సినిమా రిలీజ్ అయి 33 సంవత్సరాలు అయిన సందర్భంగా నిర్మాత మనోజ్ దేశాయ్ ఆఫ్ఘనిస్తాన్‌లో తమ చిత్ర షూటింగ్ విశేషాలు పంచుకున్నారు
ఖుదాఘవా అమితాబ్ బచ్చన్ ఆరు దశాబ్దాల సూపర్‌స్టార్ కెరీర్‌లో అత్యంత బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి.
ఇందులో అమితాబ్ బాద్షాఖాన్ గా పోషించిన పాత్ర సూపర్ హిట్ అయింది
ఈ చిత్రం దాదాపు 33 సంవత్సరాల క్రితం విడుదలైంది
సినిమా 30వ వార్షికోత్సవం సందర్భంగా నిర్మాత మనోజ్ దేశాయ్ ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు
ఈ చిత్రం షూటింగ్ సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధ సమయంలో చాలా రిస్క్ తీసుకుని అక్కడ చిత్రీకరించామని ఆయన చెప్పారు . ఇందులో పాల్గొన్న నటీనటుల కుటుంబాలు అయితే ఆఫ్ఘన్ లో షూటింగ్ అంటే తమ వారికి ఎలాంటి ప్రమాదం ఎదురౌతుందోనని భయపడ్డారని ఆయన అన్నారు.
నటి శ్రీదేవి తల్లి అయితే ఏకంగా తనను హెచ్చరించిందని , ” మనోజ్ జీ, శ్రీదేవికి ఏదైనా జరిగితే మీరు తిరిగి రాకండి. ఆమె లేకుంటే నేను నిన్ను చంపేస్తాను’ అని ముఖం మీదే చెప్పిందని ఆయన అన్నారు.
అలాగే నటుడు అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్ కూడా తనను హెచ్చరించిందని దేశాయ్ వివరించారు. ఆమె మాటలను గుర్తుచేసుకుంటూ, ‘మున్నా (అమితాబ్) కి ఏదైనా జరిగితే, జయ తెల్ల చీర కట్టుకుంటే, నువ్వు కూడా ఆత్మహత్య చేసుకుంటావు, నీ భార్య తెల్ల చీర కట్టుకుంటుంది’ అని ఆమె మరింత ఘాటుగా తనను హెచ్చరించిందని అతను చెప్పాడు.
కానీ అదృష్టవశాత్తూ ఆఫ్ఘనిస్తాన్ లో ఎటువంటి సమస్యలు లేకుండా షూటింగ్ ముగించుకుని యూనిట్ అంతా క్షేమంగా ఇండియా చేరుకుందని ఆయన చెప్పారు .
ఈ చిత్రానికి ముకుల్ ఆనంద్ దర్శకత్వం వహించగా లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం అందించారు. ఈ చిత్రం భారతదేశంలోనే కాకుండా, ఆఫ్ఘనిస్తాన్ లో కూడా రూ. 18 కోట్లకు పైగా వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇది కాబూల్‌లో 10 వారాల పాటు హౌస్ ఫుల్ తో ఆడింది
2013లో అమితాబ్ బచ్చన్ కూడా ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌లో తన షూటింగ్ అనుభవాన్ని మొత్తం గుర్తుచేసుకున్నాడు.
“సోవియట్‌లు అప్పుడే దేశం విడిచి వెళ్ళారు. అధికారాన్ని ప్రముఖ హిందీ సినిమా అభిమాని అయిన నజీబుల్లా అహ్మద్‌జాయ్‌కు అప్పగించారు. మా షూటింగ్ సంగతి తెలిసి ఆయన నన్ను కలవాలనుకున్నాడు. అనుకోవడమే కాదు మాకు అక్కడ రాజ మర్యాదలతో అతిధి ఏర్పాట్లు చేసారు . మజారే-ఎ-షరీఫ్‌లో మమ్మల్ని VVIP రాష్ట్ర అతిథులుగా చూసుకున్నారు
మాకు సాయుధ ఎస్కార్ట్‌లను తోడుగా ఇచ్చి విమానాలలో ఆ దేశంలోని అద్భుతమైన అందమైన ప్రదేశాలు అన్నిటికీ తీసుకెళ్లారు. స్థానికులు కూడా మాకు ఘనమైన ఆతిధ్యాన్ని అందించారు. వారైతే మమ్మల్ని హోటల్‌లో ఉండటానికి అనుమతించలేదు… ఒక కుటుంబం అయితే ఏకంగా మా కోసం తాము ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి మాకు అప్పగించి చిన్న ఇంటికి మారింది.”
“అయితే అక్కడ అప్పటికే భద్రతా సమస్యలు ఉన్నాయి. వాస్తవానికి, వీధుల్లో ట్యాంకులు మరియు సాయుధ సైనికులు పహారా కాస్తున్నారు.నిత్యం సైనికుల కవాతు జరుగుతుంది . అయినప్పటికీ, ఇది నా జీవితకాలంలో అత్యంత గుర్తుండిపోయే షూటింగ్ అని అమితాబ్ గుర్తుచేసుకున్నారు . మేము షూటింగ్ పూర్తిచేసుకుని తిరిగి ఇండియా వచ్చేస్తున్నప్పుడు మా లగేజీ బహుమతులతో నిండిపోయాయి
మేము భారతదేశానికి తిరిగి వెళ్లే ముందు రాత్రి కాబూల్‌లో, నజాబ్ మమ్మల్ని అధ్యక్షుడి నివాసానికి పిలిచి, మా అందరినీ ‘ఆర్డర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్’తో సత్కరించాడు . ఆ సాయంత్రం అతని మామ మా కోసం ఒక భారతీయ రాగాన్ని అద్భుతంగా పాడాడు అని అమితాబ్ ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన ఆనాటి ఖుదాఘవా షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకున్నాడు
