అయోధ్యలో రామ మందిరంలో పెండింగ్ నిర్మాణ పనులు కూడా పూర్తి అయినట్టు శ్రీరామ జన్మ భూమి తీర్థ ట్రస్ట్ సోమవారం ఒక ప్రకటనలో తెలియచేసింది
ప్రధాన ఆలయం ప్రభు రామ్ లల్లా కు అనుబంధంగా ఉన్న అన్ని ఉపాలయాలు పనులు కూడా పూర్తి అయినట్టు వారు తెలిపారు
ప్రధాన ఆలయంతో పాటు మహాదేవ్ , గణేష్ , హనుమాన్ , సూర్య భగవాన్ , భగవతి మాత , అన్నపూర్ణ మాత , శేషావతార్ , సంత్ తులసీదాస్ మందిరాలు కూడా పూర్తి అయినట్టు తెలిపారు
పురాణాల్లో పేర్కొన్న వాల్మీకి , వసిష్ఠ , అగస్త్య ఇత్యాది ఋషులకు సైతం మందిరాలు కట్టించారు
రామాయణంలో కనిపించే శబరి , అహల్యలకు సైతం మందిరాలు కట్టించారు
ఆలయం పైన కలశం ఏర్పాటుతో పాటు జటాయువు , ఉడుత విగ్రహాలను కూడా ప్రతిష్టించినట్టు వారు చెప్పారు
నవంబర్ 25 న ప్రధాని మోడీ అయోధ్య కి విచ్చేసి ప్రధాన ఆలయం పైన జెండా ఎగరవేస్తారని వారు తెలిపారు
ఇదిలా ఉండగా అయోధ్య రామాలయంలో దర్శన వేళలు కూడా మారుస్తున్నారు
మారిన వేళల ప్రకారం తెల్లవారు ఝామున 4. 30 గంటలకు మంగళ హారతి , 6. 30 గంటలకు శృంగార్ హారతి ఇచ్చిన తర్వాత ఉదయం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు
అనంతరం మధ్యాహ్నం రాజ్ భోగ్ హారతి తర్వాత 12. 30 నుంచి ఒంటి గంట వరకు ఆలయం తలుపులు మూసివేస్తారు
ఒంటిగంట తర్వాత రాత్రి 9 గంటల వరకు తిరిగి దర్శనాలకు అనుమతిస్తారు !
