నిన్న కోట శ్రీనివాసరావు గారు, ఈరోజు బి. సరోజాదేవి గారు ఇలా పాత తరం ఆణిముత్యాలు రాలిపోవడం అత్యంత బాధాకరం
పాత తరం నటి పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి.సరోజా దేవి గారు బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు
1955లో వచ్చిన “మహాకవి కాళిదాసు” అనే చిత్రంతో ఆమె తెలుగు తెరకు పరిచయమయ్యారు
తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా నటించారు
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ లాంటి దిగ్గజ నటులతో కలసి పనిచేశారు
ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే, చెట్టాపట్టగా చేతులు కలిపి చెట్టునీడకై పరిగెడుతుంటే’ పాటలో నటించిన హీరోయిన్ సరోజాదేవి గారే
ఎన్టీ రామారావు గారితో కలిసి నటించిన పాండురంగ మహాత్మ్యం సినిమాలో ఆమె నటన బహుళ జనాదరణ పొందింది
అలా ఎన్నో గొప్ప సినిమాల్లో సరోజా దేవి భాగమయ్యారు
ఆమె నటించిన కొన్ని తెలుగు చిత్రాలు
పాండురంగ మహత్యం – 1957
భూకైలాస్ – 1958
పెళ్ళి సందడి – 1959
పెళ్ళి కానుక – 1960
సీతారామ కళ్యాణం – 1961
జగదేకవీరుని కథ – 1961
ఇంటికి దీపం ఇల్లాలే – 1961
మంచి చెడు – 1963
శ్రీకృష్ణార్జున యుద్ధం – 1963
దాగుడు మూతలు – 1964
ఆత్మబలం – 1964
అమరశిల్పి జక్కన్న – 1964
ప్రమీలార్జునీయం – 1965
శకుంతల – 1966
రహస్యం – 1967
భాగ్యచక్రం – 1968
ఉమా చండీ గౌరీ శంకరుల కథ – 1968
విజయం మనదే – 1970
మాయని మమత – 1970
పండంటి కాపురం – 1972
మాతృమూర్తి – 1972
శ్రీరామాంజనేయ యుద్ధం – 1975
దాన వీర శూర కర్ణ – 1978
అర్జున గర్వభంగం – 19779
యమధర్మరాజు -1990
అల్లుడు దిద్దిన కాపురం – 1991
ఈ రోజు తుది శ్వాస విడిచిన బి సరోజాదేవి గారికి నివాళులు
విశ్వ టాకీస్