బోయపాటి బాలయ్య ల కాంబినేషన్ లో 2021 లో రిలీజ్ అయిన అఖండ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే
ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ లో భాగంగా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి
జూన్ పదిన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అఖండ 2 టీజర్ రిలీజ్ చేసారు
ఈ టీజర్ నిజంగా బాలయ్య అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది అనడంలో సందేహం లేదు
అయితే అఖండ తో పోలిస్తే అఖండ 2 లో బాలయ్య గెటప్ లో కొద్దిగా మార్పులు ఉన్నాయి . అఖండలో బాలయ్య యంగ్ గా కనిపిస్తే ఇందులో కొద్దిగా వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తాయి
ఈ టీజర్లో మంచు పర్వతాల్లో ఓ సన్నివేశం లో బాలయ్య ‘ నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు .. నువ్వు చూస్తావా ? అమాయకుల ప్రాణాలు తీస్తావా ? అనే డైలాగ్ చెప్తాడు
ఎప్పటిలానే థియేటర్లలో ఈ డైలాగ్ పేలుతుంది
ఇక ఫైటింగ్ సన్నివేశాల్లో పూర్తీ బోయపాటి మార్క్ కన్పిస్తుంది .. ఇప్పటిదాకా చూసిన బోయపాటి వేరు ఈ సినిమాలో చూడబోయే బోయపాటి వేరు ..అఖండ 2 తర్వాత బోయపాటి 2 అని అంటారేమో ఆయన అభిమానులు
ఈ సినిమాలో ఫైటింగ్ సన్నివేశాల్లో పాత రికార్డులు బద్దలు అవుతాయి
పదిమంది గన్ లు పట్టుకున్న మూకలను భుజాన వేసుకుని విసిరిపారెయ్యటం .. అలాగే మెడలో త్రిసూళాన్ని గాల్లో గిరగిరా తిప్పుకుంటూ రౌడీల తలలు తెగనరకడం బాలయ్య అభిమానులకు నచ్చుతాయి కానీ సగటు ప్రేక్షకుడు ఆవలిస్తాడు
అయితే అన్ని వర్గాలను కన్విన్స్ చేసే విధంగా బోయపాటి అఖండ 2 ని సిల్వర్ స్క్రీన్ మీద ఏ విధంగా మలుస్తాడో చూడాలి
ఇక తమన్ బీజీఎమ్ కు మంచి మార్కులే పడతాయి
టీజర్లో భారీ సెట్టింగులు చూస్తుంటే బడ్జెట్ కోసం వెనకాడకుండా ఈ సినిమాని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది
అయితే టీజర్లో కొన్ని సన్నివేశాలు చూస్తుంటే కెజిఫ్ గుర్తుకురాక మానదు
కాగా ఈ సినిమాకి బోయపాటి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ నిర్మాణ సంస్థతో పాటు బాలయ్య చిన్న కూతురు నందమూరి తేజస్వని కూడా నిర్మాతలలో ఒకరుగా ఉన్నారు ..టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 24 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి
సెప్టెంబర్ 25 న ఈ సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
పరేష్ తుర్లపాటి