బాలయ్య నటించిన అఖండ 2 మూవీని డిసెంబర్ 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు పూర్తి చేసారు
ఇందుకుగాను ఈ మధ్య బాలయ్యతో టీజర్ కూడా లాంచ్ చేసారు
టీజర్లో బాలయ్య మాట్లాడుతూ ” ఈ సినిమాలో అఖండ తాండవం ఎలా ఉంటుందో మీరు చూస్తారు ” అని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి
బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్లో విడుదలైన అఖండ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా అఖండ 2 ప్లాన్ చేసారు
వారిద్దరి కాంబో లో మొదటి భాగం హిట్ కావడం , తిరిగి అదే కాంబోలో పార్ట్ 2 విడుదల కానుండటంతో సినిమాకి ఇప్పటికే మంచి హైప్ వచ్చింది
బాలయ్య నుంచి ఆయన అభిమానులు కూడా మరో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు
జర్మనీకి చెందిన ఓ అభిమాని అయితే ఏకంగా మొదటిరోజు షో టికెట్ ను రెండు లక్షలు పెట్టి కొనుక్కుని రికార్డ్ సృష్టించాడు
ఈ మధ్య మహేష్ బాబు వారణాసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఫ్రాన్స్ కి చెందిన ఓ అభిమాని ఇప్పటినుంచే లక్ష రూపాయలతో తన టికెట్ బుక్ చేసుకున్న సంగతి తెలిసిందే
అఖండ 2 రేపటి విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న బాలయ్య అభిమానులకు షాకింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది
రేపు ఈ సినిమా విడుదల నిలిపివేస్తూ మద్రాస్ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది
స్టే ఆర్డర్ ఎందుకిచ్చారు ?
ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ పరిశీలించిన హైకోర్టు సినిమా విడుదలను నిలిపివేస్తూ స్టే ఆర్డర్ ఇచ్చింది
అసలు వివాదం ఏంటి ?
గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పై వేసిన దావాలో ఈరోస్ కు అనుకూలంగా ఆర్బిట్రల్ న్యాయస్థానం తీర్పు చెప్పింది
ఈ తీర్పు ప్రకారం 14 రీల్స్ సంస్థ ఈరోస్ కి 28 కోట్ల రూపాయలు నగదు రూపంలో చెల్లించాలి
కానీ కోర్ట్ తీర్పు తర్వాత కూడా సదరు సొమ్మును ఈరోస్ కి జమచేయకుండా 14 రీల్స్ సంస్థ దాటవేస్తూ వచ్చింది
వారికి ఎన్ని సార్లు రిమైండ్ చేసినా తమ సొమ్ము రాకపోవడంతో ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టు ను ఆశ్రయించింది
సదరు 14 రీల్స్ సంస్థ తమ సొమ్మును డిపాజిట్ చేయకపోగా తమ అనుబంధ సంస్థ ద్వారా కోట్లు ఖర్చుపెట్టి అఖండ 2 సినిమా తీయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రైట్స్ అమ్ముకుని రెట్టింపు లాభం గడించారని పిటిషన్లో పేర్కొన్నారు
పిటిషన్ పరిశీలించిన కోర్ట్ వారు అఖండ 2 సినిమాని థియేటర్లలో కానీ , ఓటిటీ లలో కానీ ఇతర డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో కానీ విడుదల చేయరాదని ఆదేశిస్తూ స్టే ఆర్డర్ ఇచ్చింది
తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు స్టే అమల్లో ఉంటుందని కోర్ట్ తెలిపింది
ఈ ఆదేశాల ప్రకారం అఖండ 2 సినిమాని థియేటర్లలో విడుదల చేయకుండా ఆపటంతో పాటు సినిమాకి సంబంధించి వాణిజ్యాన్ని , పంపిణీని కూడా నిలుపుదల చేయాల్సి ఉంటుంది
స్టే ఆర్డర్ ఎత్తేయాలంటే 14 రీల్స్ సంస్థ ఖచ్చితంగా ఆర్బిట్రల్ రూల్ ను పాటించాల్సి ఉంటుంది
అయితే మద్రాస్ హై కోర్ట్ ఆర్డర్ తమిళనాడు వరకే పరిమితమా ? లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల నిలిపివేయబడుతుందా అనేదాని మీద పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
సరిగ్గా రిలీజ్ కి ఒకరోజు ముందు తగిలిన ఈ ఎదురుదెబ్బని చిత్ర నిర్మాణ సంస్థ సత్వరమే పరిష్కరించుకుని రేపు యధాప్రకారం సినిమాని విడుదల చేస్తుందా ? లేదా ? అనేది చూడాలి
