బాపు రే
నిన్నొక వీడియో చూసా
సెట్స్ లో పెళ్ళిపుస్తకం షూటింగ్ జరుగుతుంది
కథానాయకుడు రాజేంద్ర ప్రసాద్, దివ్య వాణిల మీద సన్నివేశం చిత్రీకరిస్తున్నారు దర్శకుడు బాపు
యాక్షన్ చెప్పబోతూ ఒక్క క్షణం ఆగారు బాపు గారు
దివ్యవాణి కూడా దర్శకుడు ఎందుకు ఆగారో అర్థం కాక ఆయన వంక చూసింది
వెంటనే ఆయన దివ్యవాణి వైపు చూసి ” అమ్మాయ్! ఓసారి నీ కాలు ఇలా ఆ టీపాయ్ మీద పెట్టమ్మా ” అన్నారు
దాంతో ఏం జరిగిందో అర్థం కాక దివ్యవాణి బాపుగారు చెప్పినట్టు కాలు ఎత్తి టీపాయ్ మీద పెట్టింది
వెంటనే బాపు గారు కింద కూర్చుని కుంచెతో దివ్యవాణి పాదాల చుట్టూ ఉన్న పారాణి సరిచేశారు
పనిపట్ల బాపుగారికి ఉన్న నిబద్ధత చూసి అందరూ ఆశ్చర్య పోయారు
నిజానికి ఈ పని ఏ మేకప్ మ్యాన్ ను పిలిపించి చేయమన్నా చిటికలో చేసేస్తాడు
కానీ బాపు గారు ఎటువంటి భేషజాలకు పోకుండా తానే స్వయంగా కింద కూర్చుని కుంచెతో దివ్యవాణి పాదాల చుట్టూ పారాణి సరిచేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది
ఆ వీడియో చూసిన నేను కూడా ఆశ్చర్యపోయా
గొప్ప వ్యక్తుల సక్సెస్ వెనుక కంటికి కనిపించని ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటాయి అని తెలుసుకున్నాను
That is Bapu
పరేష్ తుర్లపాటి