బిగ్ బాస్ సీజన్ 9 లో అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య .. అదిసరే .. ఇంతకీ అగ్నిపరీక్ష ఎవరికి ? చూసేవాడికా ? వినేవాడికా ?
సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి 7 గంటలనుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతున్నట్టు ప్రోమోలో తెగ చూపించేస్తున్నారు
ఈ సీజన్లో మొదటిసారి 16 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెడుతుండగా మరో ఐదుగురుని అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ చేసి పంపుతున్నట్టు నిర్వాహకులు చెపుతున్నారు
సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకున్న కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారికి అగ్నిపరీక్ష పెట్టారట
ఈ అగ్నిపరీక్షలో నెగ్గినవాళ్లనే హౌస్ లోకి పంపిస్తున్నారు
అలా అగ్నిపరీక్షలో సెలెక్ట్ అయిన వారిలో అలేఖ్య పికిల్స్ రమ్య ఒకరు
సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి అలేఖ్య పికిల్స్ ఎందులో పాపులరో తెలుసు
అయితే ఈ అగ్నిపరీక్షకు ప్రామాణికత ఏంటో వివరాలు పూర్తిగా బయటకు రాలేదు
ఇక అలేఖ్య పికిల్స్ విషయానికి వస్తే ఈవిడ పచ్చళ్ళ వ్యాపారంతో కన్నాఅక్క అలేఖ్య బూతులతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు
మీ పికిల్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని అన్న కస్టమర్ ను పట్టుకుని అలేఖ్య నాటు బూతులతో ఉతికిపారేసింది
ఆ బూతులు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి
అప్పుడే బూతులు మాట్లాడటంలో ఆమెకున్న ప్రావీణ్యత ప్రపంచానికి తెలిసింది
బూతుల్లో ఆవిడ వాడిన బాష పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు కూడా పెట్టారు
మొదట్లో రమ్య కూడా అక్క తప్పేమీ లేదంటూ వెనకేసుకొచ్చింది
సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత గమనించిన ఆమె తప్పును ఒప్పుకుంటూ క్షమాపణ కూడా కోరింది
దరిమిలా అలేఖ్య పికిల్స్ వ్యాపారం పడిపోవడంతో కొంతకాలం డిప్రెషన్ లోకి కూడా వెళ్ళిపోయింది
మెల్లిగా తేరుకుని సినీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది
ఈ క్రమంలో కొన్ని రీల్స్ కూడా చేసింది
జనాలు ఆమెను మర్చిపోయిన సమయంలో హఠాత్తుగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ లిస్టులో అలేఖ్య సిస్టర్ రమ్య పేరు కూడా ఉండటంతో తిరిగి వెలుగులోకి వచ్చింది
షుమారు 200 మందిని సోషల్ మీడియా నుంచి ఆడిషన్స్ కు పిలిచి అగ్ని పరీక్షలు పెట్టి వారిలో మొదటి రౌండులో ఐదుగుర్ని సెలెక్ట్ చేసారు
వారిలో అలేఖ్య పికిల్స్ రమ్య కూడా ఒకరు
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్టులో రమ్య కూడా ఉండటంతో నెటిజన్లు ఆశర్యపోతున్నారు
రమ్యను ఏ ప్రాతిపదికన బిగ్ బాస్ లో సెలెక్ట్ చేసారు ?
అగ్ని పరీక్ష అంటే ఏంటి ?
బూతులు మాట్లాడటమే అగ్ని పరీక్షా ?
గతంలో బూతులు మాట్లాడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నెటిజన్ల ఆగ్రహానికి గురైన అలేఖ్య పికిల్స్ సిస్టర్స్ ప్రతిభను నిర్వాహకులు గుర్తించి అవకాశం కల్పించారా ?
అసలే బిగ్ బాస్ హౌస్ లో జంటల వెకిలి చేష్టలకు మండిపడుతున్న మహిళలు ఇప్పుడు ఏకంగా బూతులు సమర్ధించిన అమ్మాయిని హౌస్ లోకి పంపిస్తే మరింత నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందని నిర్వాహకులకు తెలీదా ?
ఒకవేళ ఈవిడ కూడా బిగ్ బాస్ హౌస్ లో బూతులు మాట్లాడితే కనీసం బీప్ సౌండ్ ఏర్పాటు చేయాల్సిందిగా కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారంటే ఆమె పాపులారిటీ ఎందులోనో ఇట్టే తెలిసిపోతుంది కదా
ఇప్పటికైనా నాగార్జున కలుగచేసుకుని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ల గురించి మరోసారి ఆలోచించాల్సిందిగా పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు !