తమిళ హీరో విక్రమ్ ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు
విలక్షణమైన నటనతో విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యాడు
ముఖ్యంగా అపరిచితుడు మూవీలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసి శబాష్ అనిపించుకున్నాడు
ఆ విక్రమ్ కొడుకే బైసన్ సినిమాలో హీరో పాత్ర పోషించిన ధృవ్ విక్రమ్
తమిళ్ లో ధృవ్ విక్రమ్ కొన్ని సినిమాలు చేసినప్పటికీ సెల్యులాయిడ్ మీద అతని పేరును నిలబెట్టింది మాత్రం బైసన్ మూవీనే
ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించడం , మరో ప్రముఖ దర్శకుడు రంజిత్ పా నిర్మాతగా వ్యవహరించడంతో వ్యవహరించడంతో తమిళ్ లో మంచి హైప్ వచ్చింది
దానికి తోడు చిత్ర దర్శకుడు మారి సెల్వరాజ్ ఎంచుకున్న కధాంశం సినిమాకి ప్లస్ అయ్యింది
ఏ రంగంలో అయినా సరే అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి జీవితంలో పైకి ఎదగటానికి యెంత కష్టపడతాడో చూపించాడు
ఆ ఎదుగుదలను చూపించటానికి దర్శకుడు క్రీడా రంగాన్ని ఎంచుకున్నాడు
ఇక కథ విషయానికి వస్తే ,
1990 నేపథ్యంలో రాసుకున్న కథ
తమిళనాడులోని మారుమూల గ్రామంలో అణగారిన వర్గాలకు చెందిన కుర్రాడు కిట్టన్ కు చిన్నప్పటినుంచీ కబడ్డీ ఆట అంటే ప్రాణం
కానీ ఊర్లో ఉన్న కట్టుబాట్లు , కులాల కుమ్ములాటల నేపథ్యంలో అతడ్ని క్రీడలకు పంపటానికి తండ్రి ఇష్టపడడు
అయినా కిట్టన్ కబడ్డీ ఆట మీద ప్రేమతో గ్రామంలో పోటీలకు వెళ్తాడు
అలా గ్రామం నుంచి ఆడటం మొదలుపెట్టి జాతీయ స్థాయి ఆటల పోటీలో పాల్గొనే స్థాయికి చేరుకుంటాడు
అయితే ఈ క్రమంలో అతడు ఎదుర్కున్న సవాళ్లు ఏంటి ?
ఊరి కట్టుబాట్లను , కులాల కుమ్ములాటలను ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్తాడు ? అనే అంశాలను కనెక్ట్ చేస్తూ కథ ముందుకి సాగుతుంది
సినిమా ఎలా ఉంది ?
ఇప్పటికీ తమిళనాడులో కొన్ని గ్రామాల్లో కట్టుబాట్లు ఉన్నాయి
ఒక సామాన్యుడు ఎదగటానికి ఆ కట్టుబాట్లు అడుగడుగునా అడ్డు పడుతూ ఉంటాయి
ఇదే అంశాన్ని కధగా రాసుకుని దర్శకుడు మారి సెల్వరాజ్ బైసన్ సినిమాని తెరకెక్కించాడు కాబట్టి తమిళనాట విజయవంతం గా ప్రదర్శించబడుతుంది
అణగారిన వర్గానికి చెందిన ఒక యువకుడు ఇంట్లోనూ , సమాజంలోనూ అసమానతలను ఎదుర్కొని అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడో కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు
కధాంశం సామజిక నేపధ్యం ఉన్న వస్తువు కాబట్టి ఈ సినిమా చాలామందికి కనెక్ట్ అయ్యింది
ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్ గా అనిపించటానికి కబడ్డీ అంశం తీసుకుని దర్శకుడు తెలివైన పని చేసాడు
కధనంలో భాగంగా హీరో , హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా జొప్పించారు కానీ అసమానతల మీద హీరో చేసిన పోరాటమే హైలెట్ అయ్యింది
అయితే అనువాదంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మనకు దాదాపు తమిళ్ సినిమానే చూస్తున్న అనుభూతి కలుగుతుంది
పాత్రల పేర్లు , ఊరి పేర్లు తమిళంలోనే ఉంటాయి
అనువాదం విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే తెలుగులో కూడా ఈ సినిమా తమిళనాట కలెక్షన్స్ తో సమానంగా పోటీ పడేది
ఎవరెలా చేసారు ?
నిన్నటిదాకా విక్రమ్ కొడుకు ధృవ్ అని చెప్పుకున్న తమిళ్ ఇండస్ట్రీ బైసన్ నుంచి ధృవ్ తండ్రి విక్రమ్ అని చెప్పుకునే స్థాయికి ఎదిగింది అతడి నటన
పాత్రకు తగ్గ నటనను ప్రదర్శించడంలో ధృవ్ సక్సెస్ అయ్యాడు
హీరో తండ్రిగా నటించిన పశుపతి నటన కూడా బావుంది
ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర పడలేదు
దానికి తోడు డీ గ్లామర్ రోల్ లో కనిపించడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది
సాంకేతిక విషయాల్లో మంచి క్వాలిటీ కనిపిస్తుంది
నివాస్ కె ప్రసన్న సంగీతం , పాటలు ఈ సినిమాకి ప్లస్
తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేవిధంగా సరైన అనువాదం లేకపోవడం ఈ సినిమాకి మైనస్
నటీనటులు : ధృవ్ విక్రమ్ , అనుపమ పరమేశ్వరన్ , పశుపతి
నిర్మాత : పా రంజిత్
దర్శకుడు : మారి సెల్వరాజ్
అక్టోబర్ 24 , 2025 లో విడుదల అయ్యింది
రేటింగ్ : 3 / 5
