ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కపిల్ శర్మ షో లో మాట్లాడుతూ , తన దివంగత భార్య శ్రీదేవి రెమ్యునరేషన్ తాను ఎలా పెంచాడో వెల్లడించాడు. అప్పటికి బోనీ కపూర్ శ్రీదేవిని పెళ్లి చేసుకోలేదు . ఆమెను వివాహం చేసుకునే ముందు నటిగా శ్రీదేవితో తన అనుభవాలను షో లో పంచుకున్నాడు
ఆయన మాట్లాడుతూ ” అప్పటికే శ్రీదేవికి బాలీవుడ్ లో చాలా అవకాశాలు వస్తున్నాయ్ . జోషిలే మూవీ కోసం శ్రీదేవిని సన్నీ డియోల్ సరసన ఎంపిక చేసారు . నేను కూడా నా సోదరుడి సరసన శ్రీదేవిని హీరోగా పెట్టి సినిమా తియ్యాలని ప్లాన్ చేశాను . అందుకోసం ముంబైలో శ్రీదేవిని కలిసాను . ఆమె యధాప్రకారం ‘ రెమ్యునరేషన్ విషయం మా అమ్మతో మాట్లాడండి ‘ అని చెప్పింది
దానితో నేను చెన్నై వెళ్లి శ్రీదేవి తల్లిని కలిసాను
అయితే ఆమెకు ఇంగ్లీష్ , హిందీ రాదు
దానితో నాకు వచ్చిన మేరకు ఆమెకు అర్థమయ్యేలా శ్రీదేవితో సినిమా ప్లాన్ చేస్తున్నాను . రెమ్యునరేషన్ గురించి మాట్లాడుదామని వచ్చాను అని చెప్పాను
వెంటనే ఆమె 10 రూపాయలు అంది
10 రూపాయలు అంటే ఆమె ఉద్దేశ్యంలో 10 లక్షలు అని అర్ధం
నేను ఒక్క క్షణం ఆలోచించాను
శ్రీదేవి అంతకుముందు చేసిన సినిమాకి 8. 5 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుందని నాకు తెలుసు
అందుకే వెంటనే నేను నో అన్నాను
ఒక్క క్షణం ఆమె కంగారు పడింది
తొమ్మిది అని అనబోయింది
ఈలోపు నేను 11 లక్షలు ఇస్తాను అన్నాను
శ్రీదేవి తల్లి ఒక్కసారిగా ఆశర్యపోయింది
వెంటనే ఓకే అని శ్రీదేవి స్టాఫ్ కి 30 వేలు విడిగా ఇవ్వాలి అంది
నేను 50 వేలు ఇస్తాను అన్నాను
అలా శ్రీదేవి తల్లితో మొదటి డీల్ ఓకే అయ్యింది
ఎలాగైనా శ్రీదేవిని నా సినిమాలోకి తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను రెమ్యునరేషన్ గురించి ఆలోచించలేదు
నేను 11 లక్షలు ఆమెకు ఇస్తూ శ్రీదేవి తదుపరి చిత్రానికి ఎవరైనా అడిగితే 15 లక్షలు చెప్పాలని షరతు విధించాను
“కానీ 15 లక్షలు ఎవరిస్తారు ? అని ఆమె నన్ను ఎదురు ప్రశ్నించింది
నేను వెంటనే యాష్ చోప్రాతో మాట్లాడి చాందిని సినిమాకు 15 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చే విధంగా సంతకాలు చేయించాను
దానితో శ్రీదేవి తల్లి చాలా సంతోషపడింది
కొన్నాళ్ళకు ఇంకో సినిమా కోసం శ్రీదేవి తల్లిని కలిసాను
నన్ను చూడగానే ఆమె సంతోషంతో ఇంతకుముందు శ్రీదేవికి 15 లక్షల రెమ్యునరేషన్ మీరే ఇచ్చారు కాబట్టి మీకు డిస్కౌంట్ ఇస్తాను 14 ఇవ్వండి అంది
నేను 14 కాదు 16 ఇస్తాను అని చెప్పి ఈసారి ఎవరైనా నిర్మాత శ్రీదేవి కాల్షీట్ అడిగితే 25 లక్షలు చెప్పమని మళ్ళీ ఇంకో కండిషన్ పెట్టాను
“25 లక్షలు ఎవరిస్తారు ?” అని ఆమె తిరిగి పాత డౌట్ నే అడిగింది
అప్పుడు ఖుదాగావా మూవీ కోసం శ్రీదేవికి 25 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చేట్లు సంతకాలు చేయించాను
అలా ఒక గొప్ప నటి శ్రీదేవి రెమ్యునరేషన్ పెరగడంలో నేను చాలా సాయం చేశాను
ఆ తర్వాత ఆమెను నేను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అంటూ శ్రీదేవి రెమ్యునరేషన్ పెంచడం వెనుక అసలు విషయాలను రివీల్ చేసాడు బోనీ కపూర్
