
అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో కనుమరుగైపోతున్న మానవ సంబంధాలు !
“అమ్మగారూ ! ఇదిగో పాల ప్యాకెట్లు .. మీ చేత్తో కొద్దిగా ఏడిగా అంత కాఫీ కలిపి పొయ్యండమ్మా” తెల్లారి ఐదు గంటలకే పాల ప్యాకెట్లు తీసుకొచ్చి అమ్మ చేతిలో పెట్టి కింద కూర్చుంది మా పాలమ్మి సింహాచలం అప్పటికే లేచి వంటిల్లు శుభ్రం చేసుకుని పాల ప్యాకెట్ల కోసం ఎదురు చేస్తుండేది అమ్మ పొద్దున్నే ఐదు గంటలకు ఫ్రెష్ గా నాడార్స్ కాఫీ పొడి ఫిల్టర్లో వేసుకుని వేడి వేడిగా దిగే డికాషన్ తో మొదటి…