
బెజవాడ రుచులు – 5
బెజవాడ రుచులు – 5 టేస్ట్ బావుంటుందని తెలిసి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా గన్నవరం నుంచి విజయవాడ వచ్చి పాకలో ఇడ్లీ తిన్నారని నిన్నటి భాగంలో చెప్పా కదా అలాగే విజయవాడలో ఐలాపురం ఇడ్లీ కోసం కూడా ఎక్కడ్నుంచో కారుల్లో వచ్చి మరీ తినేవాళ్ళున్నారు ఐలాపురం ఇడ్లీ అనగానే గాంధీ నగర్లో హోటల్ ఐలాపురం లో కింద ఏసీ రెస్టారెంట్ లో ఇడ్లీల గురించి నేను చెప్తున్నా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే…