2003 , అక్టోబర్ 1 న సరిగ్గా 22 ఏళ్ళ క్రితం ఇదే రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకుని శ్రీవారికి పట్టు వస్త్రాలు సంపర్పించటానికి తిరుమల బయలుదేరారు
చంద్రబాబు కాన్వాయి సరిగ్గా సాయంత్రం 4 గంటల 12 నిమిషాలకు అలిపిరి టోల్ గేట్ దాటి వినాయకుడి గుడి తర్వాత వచ్చే మలుపుకి చేరుకునేసరికి ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది
ఆ విస్ఫోటనానికి అక్కడ పెద్ద ఎత్తున పొగ లు కమ్ముకోవడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు
షాక్ నుంచి వెంటనే తేరుకున్న సీఎం సెక్యూరిటీ సిబ్బందికి అక్కడ బాంబ్ బ్లాస్ట్ దాడి జరిగిందని అర్థమైంది
ఆ బాంబు దాడి కూడా సీఎం నే టార్గెట్ చేసి పెట్టారని కూడా అర్థమైంది
అప్పటికి చంద్రబాబుకి రాష్ట్ర ప్రభుత్వం కల్పించే జెడ్ ప్లస్ సెక్యూరిటీ మాత్రమే ఉంది
అధికారుల ప్రాధమిక దర్యాప్తులో సీఎం సెక్యూరిటీ లోపాలు బయటపడ్డాయి
అలిపిరి దాడి తర్వాత బాబుకి కేంద్రం ఎస్పీజీ భద్రత సౌకర్యం కల్పించింది
మొత్తం 17 క్లెమోర్ మైన్స్ ఫిక్స్ చేస్తే వాటిలో కేవలం తొమ్మిది మాత్రమే పేలాయి
ఆ తొమ్మిది మైన్స్ కే చంద్రబాబు ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం యెగిరి అవతల పడింది
ఆ ధాటికి చంద్రబాబు అయితే రెండు నిమిషాల పాటు స్పృహ కోల్పోయారు
వెంటనే వెనక వస్తున్న సెక్యూరిటీ సిబ్బంది , డాక్టర్లు కలిసి ప్రధమ చికిత్స చేస్తే బాబు గారు కళ్ళు తెరిచారు
అయినా ఆయన షాక్ నుంచి కోలుకోలేకపోయారు
నిజానికి శక్తివంతమైన క్లెమైర్ మైన్స్ 17 లో 9 మాత్రమే పేలడంతో ప్రమాద తీవ్రత తగ్గింది
అదే 17 మైన్స్ పేలుంటే ఊహించని ప్రమాదం జరిగుండేది
మెరుగైన చికిత్స కోసం బాబుని హుటాహుటిన రేణిగుంట విమానాశ్రయానికి తరలించగా అప్పటి కాంగ్రెస్ పక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి బాబును పరామర్శించారు
ఈ సంఘటనను ఇన్నేళ్లయినా బాబు మర్చిపోలేకపోతున్నారు
స్వామి వారి దయ ఉంది కాబట్టే తాను ప్రాణాలతో బయట పడ్డానని , ఒకరకంగా తనకు ఇది పునర్జన్మ అని ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు !
