సడెన్గా చిరంజీవి , సీఎం ల మధ్య ‘మర్యాదపూర్వక భేటీ’ జరగడం వెనుక ఆంతర్యం ఏంటి ? ఈ భేటీ వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ ఉందా ?

Spread the love

సడెన్గా చిరంజీవి , సీఎం ల మధ్య ‘మర్యాదపూర్వక భేటీ’ జరగడం వెనుక ఆంతర్యం ఏంటి ? ఈ భేటీ వెనుక రేవంత్ మాస్టర్ ప్లాన్ ఉందా ?

మూడురోజుల క్రితం సడెన్గా చిరంజీవి తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబిలీ హిల్స్ లోని ఆయన నివాసంలో కలిశారు

వీరిద్దరి మధ్య షుమారు ముప్పై నిమిషాలపాటు వ్యక్తిగత భేటీ జరిగినట్టు సమాచారం

చిరంజీవి ముఖ్యమంత్రిని కలిసి వెళ్ళిపోయిన అనంతరం సీఎంఓ ట్విట్టర్లో ఒక ప్రకటనలో ‘ చిరంజీవి ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసారని ‘ పేర్కొన్నారు

ఈ మర్యాదపూర్వక భేటీ వెనుక అసలు కారణాలేంటో ఇంతవరకు బయటికి రాలేదు

కాగా వీరి భేటీ మర్యాదపూర్వకంగా జరిగింది కాదని .. జూబిలీ హిల్స్ ఉపఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని బిఅరెస్ నేతలు ఆరోపిస్తున్నారు

ఉప ఎన్నికలో చిరంజీవిని గెలిపించుకుని క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారని అందుకే ఈ భేటీ జరిగిందని వారు అంటున్నారు

జూబిలీ హిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకుని మరోసారి పార్టీలో తన సత్తాను నిరూపించుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు

అందులో భాగంగానే చిరంజీవితో భేటీ .. ఆయన కోడలుకు తెలంగాణా స్పోర్ట్స్ కార్పొరేషన్ కో చైర్మన్ పదవిని ముఖ్యమంత్రి కట్టబెట్టారని వారంటున్నారు

జూబిలీ హిల్స్ ఉప ఎన్నికను సీఎం ఏడాదిన్నర పాలనకు రిఫరెండంగా భావించాలని బిఅరెస్ నేతలు సవాల్ విసురుతున్న నేపథ్యంలో రేవంత్ ఇప్పటినుంచే ఆ నియోజకవర్గం మీద దృష్టి సారించారు

అందులో భాగంగా జూబిలీ హిల్స్ లో పార్టీ అభ్యర్థి ని ఎట్టిపరిస్థితుల్లో గెలిపించుకోవాలని ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు , పొన్నం ప్రభాకర్ , గడ్డం వివేక్ లకు బాధ్యతలు అప్పగించారు

ఇప్పటికే ఆ ముగ్గురు మంత్రులు నియోజక వర్గంలో తమకు అప్పగించిన పనిలో పడ్డారు

ఇదిలా ఉండగా ఎన్నికల ముందు రాజకీయ నాయకుల కన్ను చిరంజీవి మీద పడటం ఇదే మొదటిసారి కాదు

గతంలో బీజేపీ కూడా చిరంజీవి కోసం ప్రయత్నాలు చేసింది

ఆ మధ్య కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ తాను పిలిస్తే చిరంజీవి అప్పటికప్పుడు బీజేపీలోకి వచ్చేస్తారని చెప్పారు

అయినా చిరంజీవి మాత్రం అప్పుడూ స్పందించలేదు ఇప్పుడూ స్పందించలేదు

వేరే సందర్భాల్లో చిరంజీవి మాట్లాడుతూ తిరిగి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం తనకెంత మాత్రం లేదని సృష్టం చేసారు

ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవి రేవంత్ రెడ్డి ల మధ్య జరిగిన భేటీ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది

అయితే చిరంజీవి సీఎం ను కలిసిన సమయాన్ని బట్టి సినీ కార్మికుల సమస్యల విషయమై మాట్లాడటానికి కలిసి ఉంటారని కొంతమంది సినీ పెద్దలు భావిస్తున్నారు

చిరంజీవి అభిమానులు మాత్రం ఈ నెల 22 న జరగబోయే చిరంజీవి జన్మదిన వేడుకల్లో ట్రస్ట్ తరపున ఆయన చేపట్టబోయే కార్యక్రమాలను వివరించటానికే సీఎం ను కలిసారని అంటున్నారు

ఏదిఏమైనా గత కొద్దిరోజులుగా తెలంగాణా రాజకీయాలు చిరంజీవి కేంద్ర బిందువుగా మలుపులు తిరుగుతున్నాయి

ఇటీవల చిరంజీవి కోడలికి నామినేటెడ్ పదవి ఇవ్వడం దరిమిలా ఆయన సీఎం ను కలవడం అనేది సాధారణ విషయాల్లో భాగంగా జరుగుతున్నవి కావని , దీని వెనుక సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్ ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!