చిరంజీవి మాజీ ఎమ్మెల్యే , మాజీ ఎంపీ హోదాలలో ప్రభుత్వాల నుంచి రెండు పెన్షన్లు తీసుకుంటున్నారా ?
ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే చట్టసభలకు ఎన్నికైన సభ్యులకు కూడా ప్రభుత్వాలు పెన్షన్లు ఇస్తాయి
వీరిలో ఎమ్మెల్యే , ఎంపీ , ఎమెల్సీగా పనిచేసిన సభ్యులకు జీవితాంతం పెన్షన్ సౌకర్యం అందుతుంది
పెన్షనర్ మరణిస్తే వారి భార్య / భర్తలకు కూడా ఫ్యామిలీ పెన్షన్ అందుతుంది
ఒకే సభ్యుడు ఎమ్మెల్యేగానూ , ఎంపీగానూ పనిచేస్తే అతడు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల రెండు పెన్షన్లు పొందటానికి అర్హుడే
ఎమ్మెల్యేగా పనిచేసినవారికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు 50 వేల వరకు పెన్షన్ సౌకర్యం కలిపిస్తుండగా , ఎంపీగా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తికి భారత ప్రభుత్వం షుమారుగా 30 వేల వరకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తుంది
ఈ లిమిట్ ను త్వరలో మరింత పెంచనున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి
అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఒకే వ్యక్తి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నుంచి డబుల్ పెన్షన్ తీసుకోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లికి చెందిన గణేష్ అనే ఆర్టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద తెలుగు రాష్ట్రాల నుంచి రెండు పెన్షన్లు పొందుతున్న ఎమ్మెల్యే , ఎంపీల డేటా కావాలని ఆర్టీఐ కి దరఖాస్తు చేసారు
ఆర్టీఐ ఆయన దరఖాస్తుకు రిప్లై ఇస్తూ తెలుగు రాష్ట్రాల్లో డబుల్ పెన్షన్లు తీసుకుంటున్న 21 మంది సభ్యుల జాబితా అందచేసింది
ఆ 21 మందిలో సెలెబ్రిటీలు , కోట్లు సంపాదించిన బడా వ్యాపారవేత్తలు ఉన్నారని ఆయన చెప్పారు
ఒకపక్క గ్యాస్ సిలిండర్ మీద ఇచ్చే సబ్సిడీ ఒదులుకోమని ప్రజలకు హితబోధ చేస్తూ కోట్లు సంపాదించిన రాజకీయ నాయకులు మాత్రం డబుల్ పెన్షన్లు తీసుకోవడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు
అయితే డబుల్ పెన్షన్లు తీసుకోవడం తప్పేమీ కాదని చట్టంలోనే ఉందని న్యాయస్థానాలు కూడా డబుల్ పెన్షన్ల మీద వాజ్యాలు కొట్టేసాయని అందుకే చట్ట సవరణలు చేయాలని తాను పోరాటం చేస్తున్నట్టు గణేష్ చెప్తున్నారు
ఇదిలా ఉండగా అన్నిటికన్నా ఆశర్యకరమైన విషయం ఏంటంటే డబుల్ పెన్షన్లు పొందుతున్న జాబితాలో చిరంజీవి పేరు కూడా ఉంది !