Home » బాలయ్యపై 300 పీఎస్ లలో కేసులు పెట్టాలని మెగా అభిమానుల నిర్ణయం .. వాట్ నెక్స్ట్ ?

బాలయ్యపై 300 పీఎస్ లలో కేసులు పెట్టాలని మెగా అభిమానుల నిర్ణయం .. వాట్ నెక్స్ట్ ?

Spread the love

ఈమధ్య ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వాఖ్యలకు అభ్యంతరం చెప్తూ ” చిరంజీవి గట్టిగా అడిగితే అప్పటి సీఎం దిగి వచ్చాడనడం పూర్తిగా అబద్దం.. ఈ వాఖ్యలను నేను ఖండిస్తున్నా .. చిరంజీవి గట్టిగా అడిగితె ఆ సైకో సీఎం దిగిరావడమేంటి ?” అంటూ పౌరుషంగా మాట్లాడారు బాలయ్య

ఇది జరిగిన కొద్ది గంటల్లోనే చిరంజీవి పేరిట సోషల్ మీడియాలో ఓ లేఖ విడుదలైంది

సినిమా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడటానికి ఇండస్ట్రీ పెద్దలతో కలిసి తానూ తాడేపల్లికి వెళ్లడం జరిగిందనీ , ఈ సందర్భంగా సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు .. సీఎం తో టికెట్ల రేట్ల పెంపు గురించి మాట్లాడి ఒప్పించడం వల్ల నా ఒక్కడి సినిమాకే కాదు మీ సినిమాకి కూడా లాభం కలిగింది ” అంటూ ఆ రోజు తాడేపల్లిలో సీఎం జగన్ తో సమావేశం ఎలా జరిగిందో వివరణ ఇచ్చారు

అసెంబ్లీలో కామినేని మాట్లాడిన దాని ప్రకారం జగన్ సినిమా వాళ్ళని ఇంటికి పిలిచి అవమానించాడు అనే అర్థంలో ఉంది

ఇదే విషయంపై గతంలో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ సినిమా వాళ్ళని అప్పటి సీఎం జగన్ అవమానించారని పలు వేదికలలో విమర్శించారు

కానీ చిరంజీవి మాత్రం లేఖలో తమకు అలాంటి అవమానం ఏదీ జరగలేదని సృష్టత ఇచ్చారు

ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధ పడుతుండటంతో హైదరాబాద్ వచ్చేసారు

అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ అండ్ బాలయ్యలు చేసిన వాఖ్యలు దుమారం లేపాయని గ్రహించిన చంద్రబాబు వెంటనే నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగారు

దరిమిలా కామినేని తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించమని స్పీకర్ను కోరడం .. ఆయన ఆమోదించడం జరిగిపోయాయి

ఈ ఎపిసోడ్ లు జరుగుతున్నప్పుడు చిరంజీవి విదేశాల్లో ఉన్నారు

ఈలోపు సోషల్ మీడియాలో చిరంజీవి .. బాలయ్య అభిమానుల మధ్య పోస్టుల వార్ నడిచింది

మరోపక్క బాలయ్య కూడా ఈ విషయంపై నేరుగా ఎక్కడా స్పందించలేదు

ఇప్పుడు చిరంజీవి ఇండియాకు తిరిగొచ్చిన నేపథ్యంలో మెగా అభిమానులు హైదరాబాద్ లో సమావేశమై బాలయ్య పై జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో పాటు రేపు ఎపి , తెలంగాణా వ్యాప్తంగా 300 పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టాలని తీర్మానించుకున్నారు

విషయం తెలిసిన చిరంజీవి అటువంటి పనులు చేయొద్దని ఫాన్స్ కు వార్నింగ్ ఇచ్చినట్టు ఇప్పటివరకు అందిన సమాచారం

ఈ పరిస్థితుల్లో ఫాన్స్ సంగతి అలా ఉంచితే సామాన్యులకు సైతం కొన్ని ప్రశ్నలు ఉద్భవిస్తాయి

కొన్ని రోజులుగా ఫాన్స్ మధ్య జరుగుతున్న వార్ చిరంజీవికి , బాలయ్యకు తెలిసే జరుగుతున్నాయా ?

సోషల్ మీడియాలో ఇంత హోరాహోరీగా ఫాన్స్ పోరాటాలు చేసుకుంటుంటే హీరోలకు తెలియకుండా ఉంటుందా ?

తెలిస్తే సైలెంట్ గా ఎందుకుంటున్నారు ?

అభిమానులు బాలయ్య మీద కేసులు పెట్టాలని సమావేశం అయి నిర్ణయం తీసుకునేవరకు చిరంజీవికి నిజంగా తెలీదా ?

అసలు బాలయ్య తన వ్యాఖ్యల్లో చిరంజీవి కన్నా జగన్ నే పరుషంగా సైకో అంటూ మాట్లాడాడు
కానీ వైసీపీ వాళ్ళ కన్నా చిరంజీవి ఎందుకంత వేగంగా స్పందించారు ?

ఒకపక్క సినిమా వాళ్ళని జగన్ అవమానించాడని తమ్ముడు పవన్ కళ్యాణ్ చెబుతుండగా
ఇంకోపక్క అటువంటిదేమీ లేదని చిరంజీవి చెప్పడంతో ఎక్కడో క్లారిటీ మిస్ అయినట్టు లేదూ ?

సాధారణంగా చిరంజీవి వివాదాలకు దూరంగా ఉంటాడు

ఆ కాంటెక్స్ట్ లో తమ్ముడి మాటలకు విరుద్ధంగా స్టేట్మెంట్ ఇచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెడదామని అనుకున్నారా ?

మరోపక్క ఫాన్స్ అత్యుత్సాహంతో ఈ వివాదం చినికి చినికి గాలి వాన అయ్యేట్లుంది

అటు బాలయ్య చూస్తే చంద్రబాబు బావమరిది .. లోకేష్ కు మామ

ఇటు పవన్ కళ్యాణ్ కూటమిలో భాగస్వామి .. చిరంజీవికి తమ్ముడు

పంతాలకు పోయి ఫాన్స్ ఈ వివాదాన్ని మరింత రచ్చ చేస్తే ఆ ప్రభావం మొదట కూటమి మీద పడుతుంది

చిరంజీవిని అంటే పవన్ కళ్యాణ్ ఊరుకోడు
వివాదం అంటూ వస్తే ఫైనల్ గా తన అన్న వైపే నిలబడతాడు

అప్పుడు చిరంజీవి , బాలయ్య సంబంధాలు దెబ్బ తినడం సంగతి దేవుడెరుగు .. ముందు కూటమి నేతల్లో విభేదాలు వస్తాయి

కూటమి నేతల్లో విభేదాలు వస్తే రాజకీయంగా లాభ పడేది వైసీపీనే

కాబట్టి ఒక చిన్న వివాదంలే అనుకోవడానికి లేదు .. దాని వెనుక ఇన్ని ఈక్వేషన్స్ ఉంటాయి

చూద్దాం

ఈ వివాదం టీ కప్పులో తుఫాను అవుతుందో , ముంచెత్తే సునామీనే అవుతుందో చూద్దాం !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *