బెజవాడ సీపీ గా పనిచేసిన సురేంద్ర బాబు గురించి అందరికీ తెలిసిందే
విజయవాడ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే ఆయన రౌడీల మీద ఉక్కు పాదం పెట్టాడు
సీపీ దెబ్బకు చాలామంది రౌడీలు ఊరు వదిలిపోయారు
అయితే ఆ ఫ్లో లో సురేంద్ర బాబు ఓ జర్నలిస్టు తో చేసిన వాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి
అసలు సురేంద్ర బాబు ఏమన్నారు ?
ఆయన వాఖ్యల పట్ల బెజవాడ వాసుల స్పందన ఏంటి ?
ఈ రోజు జర్నలిస్ట్ పేజీలో చెప్పుకుందాం
విజయవాడ వార్త న్యూస్ పేపర్లో బ్యూరో చీఫ్ గా పనిచేస్తున్న జర్నలిస్ట్ రాజేష్ న్యూస్ కవరేజ్ కోసం సురేంద్ర బాబు ను ఆయన కార్యాలయంలో కలిశారు
విధి నిర్వహణలో భాగంగా సురేంద్ర బాబు ను కొన్ని ప్రశ్నలు అడిగారు
అందులో బెజవాడ రౌడీల ప్రస్తావన కూడా ఉంది
అయితే సురేంద్ర బాబుకు మిగతా సీపీలకు భిన్నంగా ఓ అలవాటు ఉంది
అది రివాల్వర్ ను అందరికీ కన్పించేలా ఆయన టేబుల్ మీద పెట్టుకోవడం
జర్నలిస్టుతో సంభాషణ జరిపేటప్పుడు కూడా సురేంద్ర బాబు ఒకటికి రెండు సార్లు టేబుల్ మీద ఉన్న రివాల్వర్ ను మాటిమాటికీ టచ్ చేయడం జరిగింది
అది గమనించిన జర్నలిస్ట్ గతంలో ” చాలా మంది సీపీలను ఇంటర్వ్యూ చేశాను కానీ ఇలా రివాల్వర్ ఓపెన్ గా టేబుల్ మీద పెట్టిన సీపీని మిమ్మల్నే చూస్తున్నా .. దీనివెనుక మీ ఉద్దేశ్యం ఏంటో తెలుసుకోవచ్చా ? “అని అడిగాడు
దానికి సీపీ సురేంద్ర బాబు ” గన్ ఈజ్ మై పవర్ ” వ్యవస్థను దారిలోకి తీసుకురావాలంటే ఈ గన్ ను ఉపయోగించాల్సిందే ” అన్నారు
“అంటే ఇది రౌడీలకు మీ హెచ్చరికగా భావించాలా ? “
” ఎస్ “
‘ రౌడీలను రివాల్వర్తో కాల్చి చంపేస్తా అని సింబాలిక్ గా మెసేజ్ ఇస్తున్నట్టున్నారు మీరు “
” నేనే కాదు రౌడీలను ఎవరు చంపినా కేసుండదు .. అటువంటి చీడ పురుగులను సమాజం నుంచి ఏరి వేయాలి “
మర్నాడు వార్త పేపర్లో రౌడీలను చంపేయండి .. కేసులుండవు – సీపీ సురేంద్ర బాబు సంచలన వాఖ్యలు అనే హెడ్ లైన్స్ తో జర్నలిస్ట్ రాజేష్ రాసిన ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది
ఈ వార్త అప్పట్లో బెజవాడలో సంచలనం సృష్టించింది
ఇది పోలీసులు పూర్తిగా చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే అని బెజవాడ న్యాయవాద సంఘాలు మండిపడి కోర్టులు బాయ్ కాట్ చేసారు
రౌడీల పేరుతొ సామాన్యులను చంపేస్తే పరిస్థితి ఏంటి ? అని మానవ హక్కుల సంఘాలు నిరసన ప్రదర్శనలు చేసాయి
ఒకపక్క నిరసనలు , ఆందోళనలు కొనసాగుతున్న సమయంలోనే బుడ్డ శంతన్ అనే రౌడీ షీటర్ ఎన్ కౌంటర్లో మరణించాడు
దాంతో విజయవాడలో ఆందోళనలు తారా స్థాయికి చేరుకున్నాయి
ఆఖరికి విజయవాడ ఆందోళనలు హోమ్ మినిస్టర్ వరకు చేరి అప్పటికప్పుడు సీపీ ప్రకటనకు సవరణగా ” ఆత్మ రక్షణ ” అనే క్లాజ్ చేర్చారు
‘ఆత్మ రక్షణ కోసం చేసే ప్రతిచర్యకు సరైన ఆధారాలు ఉంటే ‘ అన్న వాక్యం చేర్చారు
అది కూడా న్యాయ స్థానంలో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది అని తేల్చడంతో విజయవాడలో ఆందోళనలు ఉపశమించాయి
ఆ రకంగా సీపీ సురేంద్ర బాబు ఫ్లోలో ఒక జర్నలిస్టుతో అన్న మాటలు అప్పట్లో సంచలనం సృష్టించి ఆఖరికి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ రంగంలోకి దిగి స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది !