మహిళల ప్రపంచ క్రికెట్ కప్పును సాధించిన భారత నారీమణులకు ‘ రచ్చబండ కబుర్లు ‘ అభినందనలు తెలియచేస్తుంది
ఎలాగైనా ప్రపంచ కప్ భరత మాత చేతిలో పెట్టాలని ఒక్కో మహిళ సివంగిలా విజృంభించి కసిగా ఆడి కప్పును సాధించిన అరుదైన అపురూప దృశ్యం
భారత మహిళా క్రికెట్ జట్టులో ఒక్కొక్కరు ఒక్కో డైనమెట్
ఎక్కడా దైర్యం కోల్పోలేదు
ఎక్కడా టెన్షన్లు పడలేదు
యెంత వత్తిడి ఉన్నా గుండెల్లోనే దాచుకుని మైదానంలో ప్రత్యర్థులను శివాలెత్తించారు
రాముడ్నే కొలిచారో , అల్లాని తలిచారో , జీసస్ ను ప్రార్దించారో ,
భరత మాత చేతికి సగౌరవంగా కప్పును అందించి లక్ష్యాన్ని సాధించారు
అందుకోసం ప్రపంచ కప్ క్రికెట్ యుద్ధంలో ఒక్కొక్కరు బ్రహ్మాస్ క్షిపణులై శత్రువుల మీద విరుచుకుపడ్డారు
భారత్ టీమ్ లో తిరుగులేని బ్రహ్మాస్త్రం దీప్తి శర్మ అయి నిలిచింది .. గెలిపించింది
ఈమె చేసిన మ్యాజిక్ అంతాఇంతా కాదు
ఒకపక్క ప్రత్యర్థుల వికెట్లను చకచకా నేలకూలుస్తునే , మరోపక్క భారత్ కు పరుగుల సునామీని సాధించిపెట్టింది
ఒకే ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ మొత్తంలో 200 పరుగులు సాధించి 20 వికెట్లు పడగొట్టిన తోలి మహిళా క్రికెటర్ గా దీప్తి శర్మ రికార్డ్ బద్దలు కొట్టింది
ప్రత్యర్థులతో తలపడిన మొత్తం 9 మ్యాచుల్లో దీప్తి యావరేజ్ 30. 71 పరుగులతో , 90 . 71 స్ట్రైక్ రేట్ తో మొత్తం 215 పరుగులు చేసింది
ఈ టోర్నమెంట్ మొత్తంలో ఆమె 3 అర్ద సెంచరీలు చేసింది
యావరేజ్ న కేవలం 24.11 పరుగులు ఇచ్చి 22 వికెట్లు పడగొట్టింది
దీనితో గతంలో ప్రపంచ కప్ లో 20 వికెట్లు పడగొట్టిన శుభంగి మరియు నీతు కులకర్ణి రికార్డ్ ను దీప్తి బద్దలు కొట్టింది
ఇందులో 39 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టడం దీప్తి కెరీర్ లో బెస్ట్ రికార్డ్
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచులో దీప్తి 58 పరుగులు చేసి విజయానికి గట్టి పునాదులు వేయడమే కాకుండా 5 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించింది
ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అంటే చాలా వత్తిడి ఉంటుంది
అంత టెన్షన్ లో అంత కూల్ గా ఎలా అడగలిగారని దీప్తిని ప్రశ్నిస్తే ,
“నా చేతిలో బ్యాటు , బంతి రెండూ ఉన్నాయి .. సిట్యుయేషన్ బట్టి బ్యాటును ఎలా వాడాలో , బంతిని ఎలా విసరాలో తెలుసుకున్నాను .. ఆటలో కప్పు గెలవాలనే ఏకైక లక్ష్యమే కళ్ళముందు ఉంది .. అంతే .. ఇంకే టెన్షన్లను మనసులోకి రానివ్వలేదు ” అని చిరునవ్వుతో చెప్తుంది
దీప్తి శర్మ తన కెరీర్ మొత్తంలో 36 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు సాధించిన మహిళా క్రికెటర్ గా రెండవ స్థానంలోకి వచ్చింది
ఇప్పటివరకు ఝలన్ గోస్వామి 43 వికెట్లు సాధించి మొదటి స్థానంలో ఉంది
ఈ విజయాన్ని తన తల్లితండ్రులకు అంకితమిస్తున్నట్టు దీప్తి శర్మ చెప్పింది !
