తెలంగాణా ఉద్యమ సమయంలో తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి పోరాటం చేస్తే రాజకీయ నాయకులు , అధికారంలో ఉన్న నేతలు ఎవరూ తనను పట్టించుకోలేదని, ఉద్యోగం కోల్పోయి అనారోగ్యం బారిన పడిన తాను ఎక్కువ రోజులు జీవించలేనని రెండ్రోజుల క్రితం ఆవేదనతో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది మాజీ డీఎస్పీ నళిని
సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు
తక్షణం నళిని ఇంటికి వెళ్లి ఆమెకు కావాల్సిన సాయం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావును ఆదేశించారు
సీఎం ఆదేశాలతో కలెక్టర్ ఆమె ఇంటికెళ్లి పరామర్శించారు
నళిని ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసి ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు
ఇప్పటివరకు ఆమె వైద్య చికిత్సలకు అయిన ఖర్చును సీఎం సహాయ నిధి నుంచి అందచేస్తామని కలెక్టర్ చెప్పారు
అయితే ఈ సందర్భంగా నళిని తన సర్వీస్ విషయాన్ని కలెక్టర్ను ప్రశ్నించగా , ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువస్తామని కలెక్టర్ చెప్పారు
నళిని కి ఎటువంటి సాయం కావాలన్నా చేయమని సీఎం తనను ఆదేశించినట్టు అనంతరం కలెక్టర్ చెప్పారు
