హైద్రాబాదుకు సమీపంలో మరో అద్భుతమైన దేవాలయం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి గుడి
స్వర్ణగిరికి పర్వదినాల్లో మరియు వారాంతం సెలవుల్లో విపరీతమైన రద్దీ ఉంటుంది
ఈ గుడి చూడాలంటే పగలు కంటే సాయంత్రం విధ్యుత్ దీపాల వెలుగులో దేదీప్యమానంగా బావుంటుంది
హైదరాబాదుకు షుమారు 40 కిలోమీటర్ల దూరంలో యాదగిరి గుట్టకు వెళ్ళే దారిలో హైవేకు అనుకునే స్వర్ణగిరి దేవాలయం ఉంటుంది
మానేపల్లి జ్యుయలర్స్ వారు ఈ దేవాలయం నిర్మించారని తెలిసింది
తిరుమల మాదిరి చక్కటి ఆకృతులతో చూడముచ్చటగా ఉంది
సాయంత్రం లైటింగ్ తో మరింత బావుంది
అయితే తిరుమలలో మహా ద్వారం ఎదురుగా బేడీ ఆంజనేయ స్వామి వారు ఉంటారు.. అలాగే అఖండ దీపం కూడా ఉంటుంది
కానీ ఇక్కడ ప్రధాన ఆలయం పక్కన ఆంజనేయ స్వామి వారు ఉంటారు..అలాగే ఎదురుగా అఖండ దీపం ఉంటుంది
ప్రధాన ఆలయం పక్కనే కోనేరులో శేష శయణుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ గా ఉంది
ఇక దర్శనాలకు రేట్లు ఇక్కడ కూడా పెట్టారు
స్పెషల్ ఎంట్రీ 50 రూపాయలు
600 రూపాయలకు ఇద్దరు
1000 రూపాయలు 2,000 వేల రూపాయలకు ఐదుగురు చొప్పున ప్రత్యేక దర్శనాలు ఉంటాయి
ఉచిత దర్శనం కూడా ఉంది
వృద్దులకు .. వికలాంగులకు వీల్ ఛైర్లు కూడా ఏర్పాటు చేసారు
తిరుమల మాదిరి క్యూ లైన్లో మహాద్వారం మీదుగా ఆలయంలోకి వెళ్ళగానే చుట్టూ మండపాలతో మధ్యలో గర్భ గుడి కనిపిస్తుంది
నిలువెత్తు స్వామి వారి రూపం చాలా బావుంది
ఇక్కడ ఒక గడప దూరంలోనే దర్శనం చేయించడంతో స్వామి వారిని దగ్గరగా చూడవచ్చు
దర్శనం తర్వాత క్యూ లైన్లో ఉచిత ప్రసాదాలు ఇస్తారు
లడ్డు ప్రసాదం 50 రూపాయలు
అయితే దేవాలయం ధర్మ కర్తలు మెయింటైనెన్స్ విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది
పార్కింగ్ కోసం గుడికి 500 మీటర్ల దూరంలో ప్రత్యేకంగా బోలెడు ఖాళీ స్థలం కేటాయించినా కార్లు గుడికి వెళ్ళే దారిలోనే అటూ ఇటూ పార్కింగ్ చేసేస్తున్నారు
ఈ రాంగ్ పార్కింగులను మానిటర్ చేసేవాళ్ళు లేరు
ఇక వర్షం పడితే క్యూ లైన్లో ఉన్నవాళ్ళు కూడా తడిసి ముద్ద అవుతున్నారు
వారికోసం సన్ రూఫ్ లు మరిన్ని వేస్తే బాగుంటుంది
గర్భ గుడిలో కూడా షామియానా టైపు రూఫ్ పరదాలు వేశారు కానీ పల్చగా ఉండటంతో వాటినుంచి కూడా వర్షపు నీరు కారి భక్తులు తడిసిపోతున్నారు
ఇక స్వామి వారి దగ్గరకు రాగానే జరగాలి జరగాలి అంటూ లాగిపడేయటానికి తిరుమలలో మాదిరి ఇక్కడ కూడా నలుగురు మనుషులు రెడీ గా ఉన్నారు
మొత్తమ్మీద హైదరాబాద్ వాసులకు..ఆ మాటకొస్తే దగ్గరలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వర్ణ గిరి దేవాలయ దర్శనం అద్భుతమే అని చెప్పవచ్చు
ఆ విషయం ఎక్కడెక్కడినుంచో కారుల్లొ..బస్సుల్లో..ఆటోల్లో..నడుచుకుంటూ గుడికి వచ్చిన వేలాది భక్తులను చూసిన తర్వాత నాకు అర్ధమైంది !
పరేష్ తుర్లపాట