అంతా వాళ్ళే మాట్లాడేసుకుంటే ఇగ రేవంత్ ఇజ్జత్ ఏముంది ? అందుకే క్లైమాక్సులో కథ మలుపు తిప్పాడు !
గత పదిహేడు రోజులుగా హైద్రాబాదులో ఫిలిం ఫెడరేషన్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే
తమ వేతనాలు ముప్పై శాతం పెంచాలని వీరి ప్రధాన డిమాండ్
అయితే ఐదు శాతం మించి పెంచేది లేదని నిర్మాతల మండలి మొదట్లోనే తెగేసి చెప్పింది
చర్చలు విఫలం అవడంతో కార్మికులు లేబర్ కమిషనర్ ను ఆశ్రయించారు
వివాదం లేబర్ కమిషనర్ వద్ద పెండింగ్ లో ఉండగానే సమస్య పరిష్కారానికి చిరంజీవి రంగంలోకి దిగారు
ముందుగా ఛాంబర్ నిర్మాతలతో ఆయన చర్చలు జరిపారు
తదుపరి కార్మికుల సంఘాలను కూడా తన ఇంటికి పిలిపించుకుని చర్చలు జరిపారు
చిరంజీవి మధ్యవర్తిత్వం ఫలించి నిర్మాతలకు , కార్మికులకు మధ్య ఈరోజు చర్చలు జరగాల్సి ఉంది
అలా జరిగితే తెలంగాణా సీఎం రేవంత్ ఇజ్జత్ ఏముంది ?
అంతా సిద్ధం అయిన సమయంలో అనూహ్యంగా ఆఖరి నిమిషంలో రేవంత్ కథను మలుపు తిప్పారు
ఇరువర్గాల మధ్య సమస్య పరిష్కారానికి సీఎం జోక్యంతో ప్రభుత్వం తరపున అధికారులను పంపిస్తున్నట్టు సీఎంవో నుంచి ప్రకటన వచ్చింది
దీంతో ఇరువర్గాల మధ్య ఈరోజు జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి
మరోపక్క కార్మికులు పట్టలేని ఆనందంతో రేవంత్ చిత్ర పటానికి పాలాభిషేకాలు చేసారు
సీఎం జోక్యం చేసుకోవడం వల్ల తమ సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
గత పదిహేడు రోజులుగా సమ్మె జరుగుతున్నా స్పందించని ప్రభుత్వం , ఇప్పుడు నేరుగా సీఎం జోక్యం చేసుకుని రంగంలోకి దిగడం పట్ల పలువురు ఆశర్యపోతున్నారు
అయితే రేవంత్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు కూడా హర్షం ప్రకటిస్తున్నాయి
మరోపక్క సమస్య పరిష్కారం అయ్యే దిశలో ఆఖరి నిమిషంలో రేవంత్ రంగంలోకి దిగి ఇస్స్యూ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం వ్యూహాత్మకమే అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు
ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన విధానాలను సూచించడం ద్వారా పరిష్కార మార్గాలను తన చేతుల్లోకి తీసుకోవడమే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీ ని తన గుప్పిటలోకి తీసుకున్నారు !
రేవంతా మజాకా !!
పరేష్ తుర్లపాటి