“నేను హనుమాన్ భక్తుడ్ని” అని చిరంజీవి మొదటిసారి ఏ సందర్భంలో అల్లురామలింగయ్యకు చెప్పాడో తెలుసా ? చిరు పుట్టినరోజు సందర్భంగా ఇంట్రెస్టింగ్ స్టోరీ !

Spread the love

అందరిలా సినీ అవకాశాల కోసం ఓ రాయేసి అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకోలేదు !
కొందరిలా సినిమాలను కేవలం హాబీలా భావించలేదు అతను

అలా అనుకుంటే ,
ఈ రోజు ఆ మొగల్తూరు అబ్బాయ్
మెగాస్టార్ అయ్యేవాడు కాదు !

అతడి గోల్ వేరు ,

ఎన్టీఆర్ , ఏ ఎన్ ఆర్ , కృష్ణ ,శోభన్ బాబు , కృష్ణంరాజు ల లాంటి పెద్ద హీరోల హవా నడుస్తున్న కాలంలోనే
కసిగా సినీ ఫీల్డ్ లోకి దిగాడు

ఎవరికీ పోటీగా కాదు
అతడికి అతడే పోటీ గా

ఎవరినీ అనుకరించలేదు ,
తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ లో దూసుకుపోయాడు

అనతికాలంలోనే అభిమానులు అతడినే అనుసరించేంత ఎదిగాడు !

అప్పటిదాకా ఉన్న పాటల స్థానంలో కొత్త ట్రెండ్ సృష్టించాడు
పాటల్లో ఫైటుల్లో తన సొంత మార్కు బాణీ ని ప్రేక్షకుల్లో ఎక్కించాడు

అంతే ,

అతడు వెనుతిరిగి చూసుకునే అవసరం పడలేదు
వెండి తెరపై ఓ కొత్త శకం మొదలైంది

కొణిదెల వర ప్రసాద్ కాస్తా చిరంజీవి అయ్యాడు
మొగల్తూరు కుర్రోడు కాస్తా మెగాస్టార్ అయ్యాడు !

ఒక సామాన్య మొగల్తూరు కుర్రోడు సినీ ఇండస్ట్రీలో
ఈ స్థాయికి ఎదిగాడంటే ,

అందుకు మూడే మూడు కారణాలున్నాయి !

  1. స్వయంకృషి
  2. స్వయంకృషి
  3. స్వయంకృషి

అంతే ,

దట్ ఈజ్ చిరంజీవి

ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు

అన్నట్టు ఈ రోజు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలో నిజంగా జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవండి

చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో అల్లు రామలింగయ్య గారిని ఓ పనిమీద కలవటానికి ఆయనింటికి వెళ్లారు
అయితే ఆ సమయంలో అల్లు ఇంట్లో లేరు

ఆయన కూతురు సురేఖ తలుపు తీసి చిరంజీవిని ఇంట్లోకి ఆహ్వానించింది
అల్లు ఇంట్లో లేరని తెలిసిన చిరంజీవి మళ్ళీ వచ్చి వారిని కలుస్తానని చెప్పి వెళ్లిపోయారు

ఆయన వెళ్ళిపోయిన తర్వాత సురేఖ ‘నాన్న కోసం ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరు ?’ అని తన కజిన్ ను అడిగింది

అతను వెంకట్రావు గారి అబ్బాయి వరప్రసాద్ అని కజిన్ సమాధానం చెప్పింది
ఎందుకో ఆ క్షణమే సురేఖ మనసులో చిరంజీవి రూపం ముద్ర పడిపోయింది

ఇదిలాఉండగా అల్లురామలింగయ్య గారు మాత్రం తన కూతుర్ని సినిమా వాళ్లకు కాకుండా ఏ ఐఏఎస్ కో , గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న ఉద్యోగికో ఇచ్చి పెళ్లి చెయ్యాలని అనుకున్నాడు

సరిగ్గా ఇదే సమయంలో ఓ అనుకోని సంఘటన జరిగింది

ఓసారి అల్లు రామలింగయ్య , మరికొందరితో కలిసి ట్రైన్లో జర్నీ చేసే అవకాశం చిరంజీవికి వచ్చింది

అల్లు సరదాగా చిరంజీవికి లిక్కర్ ఆఫర్ చేసారు
చిరంజీవి వద్దన్నారు

అల్లు రామలింగయ్య రిపీటెడ్ గా అడుగుతుండటంతో చిరు ” సార్ ! నేను హనుమాన్ భక్తుడిని .. మందు తాగను ” అని ఖరాఖండిగా చెప్పడంతో అల్లు ఆశర్యపోయారు

సాధారణంగా సినిమా ఫీల్డులో మందు అలవాటు కామన్
కానీ చిరంజీవి అందుకు విరుద్ధంగా కొన్ని నియమాలు పెట్టుకుని పాటిస్తున్నారు
చిరంజీవి ప్రిన్సిపుల్స్ అల్లుకి నచ్చాయి

చిరంజీవి క్యారక్టర్ మాత్రమే కాదు ఆయన టాలెంట్ కూడా అల్లురామలింగయ్య గుర్తించే సందర్భం 1978 లో మనవూరి పాండవులు సినిమా ద్వారా వచ్చింది

ఆ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు

ఆ సినిమా షూటింగ్ సందర్భంలోనే చిరంజీవిలో డెడికేషన్ , సినిమాల పట్ల అతడికున్న ప్యాషన్ గమనించిన అల్లు ముగ్దుడు అయ్యాడు
ఈ కుర్రాడు భవిష్యత్తులో గొప్ప స్టార్ అవుతాడని ఆ క్షణమే అల్లు గుర్తించాడు

ఇక క్షణం ఆలోచించలేదు

చిరంజీవిని తన అల్లుడిగా చేసుకోవాలని నిర్ణయించుకుని ప్రముఖ నిర్మాత జయకృష్ణ ను చిరంజీవి తండ్రి వద్దకు రాయబారం పంపారు

కానీ అప్పటికే తన కెరీర్ బిగినింగ్ లో ఉన్నందున ఇప్పట్లో పెళ్లి వద్దని 25 ఏళ్ళ చిరంజీవి చెప్పినప్పటికీ వెంకట్రావు గారికి కూడా ఈ సంబంధం నచ్చటంతో ఆయన చిరంజీవిని ఒప్పించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

ఆ విధంగా 1980 లో మెగాస్టార్ చిరంజీవి అల్లు వారి అల్లుడు అయ్యారు
ఈరోజు 70 వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!