హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం..ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం..ధర్మాన్ని కాపాడేందుకు ఒక యోధుడు వస్తాడు -హరిహర వీర మల్లు

Spread the love

హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం
ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం
ధర్మాన్ని కాపాడేందుకు ఒక యోధుడు వస్తాడు !

హరిహర వీర మల్లు మూవీలో పవన్ కళ్యాణ్ ఇంట్రోలొ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మీద పై వాక్యాలు స్క్రోల్ అవుతూ ఉంటాయి

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న హరిహర వీర మల్లు సినిమాకి సంబంధించి ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది

మూడు నిమిషాల ట్రైలర్ పై లైన్ లతో మొదలౌతుంది

దీన్నిబట్టి చావా సినిమా మాదిరి హరిహర వీర మల్లులో కూడా హిందూ ముస్లిం యుద్ధాల నేపథ్యం ప్రముఖంగా ఉంటుందని అర్ధమౌతుంది

సినిమా నిర్మాత ఎ ఎమ్ రత్నం కూడా హరిహర వీరమల్లు చూసినవాళ్లు చావా చూసినప్పటిలా భావోద్వేగాలకు లోను అవుతారని చెప్పారు

ఇదిలా ఉండగా అసలు సినిమాకి ఏ ముహూర్తాన కొబ్బరి కాయ కొట్టారో కానీ హరిహర వీర మల్లు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంది

సినిమాకి మొదట దర్శకత్వం వహించిన క్రిష్ ను కొన్ని కారణాలతో తప్పించి జ్యోతి కృష్ణకు దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు

పీకే రాజకీయాల్లోకి రావడం వల్ల షూటింగ్ కూడా ఆలస్యం అయ్యింది

తీరా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటున్న సమయంలో థియేటర్ల బంద్ వివాదంతో వాయిదా పడింది

తర్వాత జూన్ 12 న రిలీజ్ చేద్దాం అనుకున్నారు

అది కూడా వాయిదా పడి ఫైనల్ గా జులై 24 న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవబోతుంది

ఇక ట్రైలర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఖచ్చితంగా పూనకాలు తెప్పించే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కంటి చూపుతో పులిని కంట్రోల్ లో పెట్టే సన్నివేశం అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి

ఇక పవన్ కళ్యాణ్ తో యుద్ధ సన్నివేశాలు భారీ ఎత్తున ఉన్నాయి . ఇందులో పీకే కత్తి యుద్ధం , కర్ర యుద్ధం ,మల్ల యుద్ధం , ఫిరంగి యుద్ధాల సన్నివేశాలు చూపించారు

యుద్ధ సన్నివేశాల్లో భారీ ఎత్తున దింపిన జూనియర్ ఆర్టిస్టులను , సెట్టింగులను చూస్తుంటే నిర్మాత ఖర్చుకు వెనకాడలేదనిపిస్తుంది

ఎమ్ ఎమ్ కీరవాణి అందించిన బీజీఎమ్ బాగుంది
విజువల్స్ పరంగా కూడా రిచ్నెస్ కన్పిస్తుంది

పవన్ కళ్యణ్ మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో నిర్మాత బడ్జెట్ కు వెనకాడకుండా భారీ ఎత్తున ఖర్చుపెట్టినట్టు ఉంది

మాములుగా తన సినిమా ట్రైలర్ ఒకసారి చూసే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ మాత్రం 7 సార్లు చూసినట్టు నిర్మాత రత్నం చెప్పారు

ట్రైలర్ రిలీజ్ అవడం ఆలస్యం యూ ట్యూబ్ లో దూసుకుపోతూ ట్రేండింగ్ అవుతుంది !

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!