ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే .. ఇదేలే .. – అన్నదమ్ముల అనుబంధం !
ఆగస్టు 15 న సూపర్ సిక్స్ లో ఒకటైన స్త్రీ శక్తి పధకంలో భాగంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభం అయ్యింది
ఈ పధకాన్ని ప్రారంభిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ లు ఉండవల్లి నుంచి విజయవాడ బస్ స్టాండ్ వరకు బస్సులో కలిసి ప్రయాణించారు
ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి
బస్ లో ముందుగా అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు కండక్టర్ కి డబ్బులిచ్చి తన టికెట్ తీసుకున్నారు
ఆ వెనకే ఎక్కిన పవన్ కళ్యాణ్ తన టికెట్ కు డబ్బులు ఇవ్వబోగా వెనకనుంచి నారా లోకేష్ ఒక్క ఉదుటున ముందుకొచ్చి ” అన్నా ! ఇది నా కాన్స్టిట్యూషన్ .. డబ్బులు మీరివ్వడమేంటి ? నేనే ఇస్తా .. అదీ ఊరికే కాదులే .. అందుకు ప్రతిఫలంగా నా నియోజకవర్గానికి నిధులు ఎక్కువ తీసుకుంటా ” అనడంతో పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఘొల్లున నవ్వారు
లోకేష్ ముందుకొచ్చి కండక్టర్ దగ్గర సీఎం , డిప్యూటీ సీఎం లు ఇచ్చిన డబ్బులు వాపసు ఇప్పించి మొత్తం అందరి టికెట్లకు తనే డబ్బులు ఇచ్చాడు
ఇక బస్సులో ముందు సీట్లో విండో దగ్గర చంద్రబాబు కూర్చోగా ఆయన వెనక సీట్లో పవన్ కళ్యాణ్ , ఆ వెనక సీట్లో లోకేష్ లు కూర్చున్నారు
ఉండవల్లి నుంచి విజయవాడ వరకు జరిగిన బస్ ప్రయాణంలో లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ లు ఆద్యంతం హుషారుగా ఛలోక్తులు విసురుకుంటూ కనిపించారు
ఒక దశలో బస్సులో మాటలు ఎక్కువ అవడంతో ముందు నుంచి ఎవరో అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అనడంతో ‘ నా వెనక సీట్లో ఉన్న అబ్బాయి అల్లరి చేస్తున్నాడు ‘ అని పవన్ కళ్యాణ్ ఛలోక్తి విసరడంతో ‘ అన్నా ‘ అంటూ లోకేష్ కూడా పగలబడి నవ్వేసాడు
బస్సులో వీళ్లిద్దరి ఛలోక్తులు చూసిన మిగిలిన ప్రయాణీకులు కూడా నవ్వుకున్నారు
రాజకీయాల్లో సమీకరణాలు బావుంటే రిలేషన్స్ కూడా బావుంటాయ్
తేడాలు వస్తేనే వేరు కుంపట్లు పెట్టుకుంటారు
ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ , లోకేష్ ల మధ్య సంబంధాలు బావున్నాయ్ !
పరేష్ తుర్లపాటి