Home » అన్న మా అసోషియేషన్ ప్రెసిడెంట్- చెల్లికి అవమానం – పట్టించుకోరా ? – మంచుకు హేమంతం తోడైంది !

అన్న మా అసోషియేషన్ ప్రెసిడెంట్- చెల్లికి అవమానం – పట్టించుకోరా ? – మంచుకు హేమంతం తోడైంది !

Spread the love

అన్న మా అసోషియేషన్ ప్రెసిడెంట్- చెల్లికి అవమానం – పట్టించుకోరా ? – మంచుకు హేమంతం తోడైంది !

నిన్న మంచు లక్ష్మిని ఓ జర్నలిస్ట్ ఇంటర్వూ చేస్తూ ‘ 50 ఏళ్ళ వయసు దగ్గరలో ఉన్నా , 12 ఏళ్ళ కూతురు ఉన్నా మీరింకా పొట్టి బట్టలు ఎందుకు వేసుకుంటున్నారంటూ ‘ ? వేసిన ప్రశ్న వివాదం రేపిన సంగతి అందరికీ తెలిసిందే

జర్నలిస్ట్ ప్రశ్నల మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంచు లక్ష్మి ఆయన మీద ఫిలిం ఛాంబర్లో రాత పూర్వక కంప్లైంట్ కూడా ఇచ్చింది

ఇలా ఉండగా నటి హేమ ఈ వివాదం మీద స్పందించింది

“సినిమా వాళ్లంటే జర్నలిస్టులకు లోకువ అయిపొయింది .. మరీ ముఖ్యంగా మహిళలను బాడీ షేమింగ్ పేరిట కించపరిచే విధంగా కధనాలు రాస్తున్నారు . గతంలో నా విషయంలో కూడా జర్నలిస్టులు ఇదే విధంగా ప్రవర్తించారు . బెంగుళూరు రేవ్ పార్టీలో నా మీద చిలవలు పలవలుగా కధనాలు అల్లారు . వారి రాతల వల్ల మా అసోషియేషన్లో నా సభ్యత్వం కూడా పోయింది . తిరిగి అతి కష్టం మీద నా సభ్యత్వం పునరుద్ధరించుకోగలిగాను . వారి తీరుతో విసిగి నేను కూడా అప్పట్లో మా అసోషియేషన్ లో కంప్లైంట్ చేశాను. నా విషయం అలా ఉంచితే మంచు లక్ష్మి మీద బాడీ షేమింగ్ వాఖ్యలు చేసిన జర్నలిస్ట్ తీరును ఇప్పటివరకు ఎవరూ ఖండించలేదు . ఆమె అన్న విష్ణు సాక్ష్యాత్తు మా అసోషియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు . చెల్లి మీద ఇంత అవమానం జరిగినా ఎందుకు పట్టించుకోవడం లేదు? . ఇప్పటికైనా మంచు లక్ష్మి విషయంలో మా అసోషియేషన్ కలగచేసుకుని సదరు జర్నలిస్ట్ మీద చర్యలు తీసుకోవాలి” అని ఒక వీడియో ద్వారా చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు నటి హేమ


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *