Home » ఫ్యామిలీ అంతా కలిసి ఓ మాంచి ఫీల్ గుడ్ సినిమా చూద్దామనుకుంటున్నారా ? అయితే హృదయపూర్వం చూసేయండి !

ఫ్యామిలీ అంతా కలిసి ఓ మాంచి ఫీల్ గుడ్ సినిమా చూద్దామనుకుంటున్నారా ? అయితే హృదయపూర్వం చూసేయండి !

Spread the love

ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే డైలాగులు , చెవులు చిల్లులు పడే BGM లు , వెండి తెర మొతం ఎరుపెక్కే రక్తపాత వయోలెన్సులు , అర్ద వస్త్రాలు వేసుకున్న హీరోయిన్ ఐటెం సాంగులు లేకుండా కుటుంబమంతా కలిసి ఓ మాంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకుంటున్నారా ?
అయితే ఇంకెందుకాలస్యం ?

మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం చూసేయండి

ఈ సినిమా మలయాళంలో వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టి విజయవంతంగా దూసుకుపోతుంది

ఇప్పుడు తెలుగులో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది

ఈ సినిమా చూస్తే మోహన్ లాల్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఎందుకిచ్చారో అర్ధమౌతుంది

మలయాళం సినిమాలు అనగానే హర్రర్ సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్లు మాత్రమే ఉంటాయని అనుకుంటాం

కానే కాదు

తురుడం క్రైమ్ థ్రిల్లర్ మూవీలో కొడుకుని చంపిన పోలీసుల మీద రివెంజ్ తీసుకునే పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించిన మోహన్ లాలే ఈ సినిమాలో ఓ ఎమోషనల్ టచ్ ఉన్న సాఫ్ట్ పాత్రలో నటించి అందర్నీ మెప్పించాడు

ఈ సినిమాలో కథ కన్నా కధనం బాగుంటుంది

కథ విషయానికి వస్తే సినిమా ప్రారంభమే గ్రీన్ ఛానెల్ ద్వారా మోహన్ లాల్ కు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా మొదలౌతుంది

కేరళ కోచి లో ఉండే సందీప్ ( మోహన్ లాల్ ) క్లౌడ్ కిచెన్ నడుపుతుంటాడు

అతడికి గుండె సంబంధిత సమస్య ఉండటంతో ప్రమాదంలో చనిపోయిన కల్నల్ రవిచంద్రన్ గుండెను డాక్టర్లు పూణే నుంచి గ్రీన్ ఛానెల్ ద్వారా తెప్పించి సందీప్ కు అమరుస్తారు

హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు కొద్ది రోజులపాటు అతడికి సహాయకుడిగా జెర్రీ ( సంగీత్ ప్రతాప్ ) ను పంపిస్తారు

సందీప్ కు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత పూణే నుంచి కల్నల్ రవిచంద్రన్ కుమార్తె హరిత ( మాళవిక మోహన్ ) వచ్చి తన తండ్రి గుండెనే సందీప్ కు అమర్చారు కాబట్టి తన వివాహ నిశ్చితార్దానికి పూణే రావాల్సిందిగా అతడిని ఆహ్వానిస్తుంది

దానితో సందీప్ జెర్రీ ని తీసుకుని హరిత వివాహ నిశ్చితార్దానికి పూణే వెళ్తాడు

అక్కడికి వెళ్ళాక అనుకోకుండా హరిత నిశ్చితార్థం క్యాన్సిల్ అవుతుంది

రెండ్రోజులు మాత్రమే ఉండాలనుకున్న సందీప్ కొన్ని వారాల పాటు పుణేలో హరిత ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది

అసలు హరిత నిశ్చితార్థం ఎందుకు క్యాన్సిల్ అవుతుంది ?

సందీప్ మరికొన్ని రోజులు అక్కడే ఉండిపోవాల్సి పరిస్థితులు ఎందుకు వచ్చాయి ?

సందీప్ హరిత ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది ? అనేదే మిగిలిన కథ

ఎవరెలా చేసారు ?

సినిమాలో మనకు మోహన్ లాల్ కనిపించడు
గుండె మార్చుకున్న సందీప్ మాత్రమే కనిపిస్తాడు

నిజంగా మోహన్ లాల్ కే గుండె మార్చారా అన్నంత సహజంగా నటించాడు

ఆ బాడీ లాంగ్వేజ్ , డైలాగ్ డెలివరీ , మేనరిజం అన్నీ కలిపి సందీప్ లో పరకాయ ప్రవేశం చేసాడు

సినిమా చూస్తున్నంత సేపు మోహన్ లాల్ ఫేస్ ఫ్రెష్ గా అనిపించి మరి కాసేపు చూడాలనిపించేలా హావ భావాలు ప్రదర్శించాడు

ఎక్కడా హీరోయిజం కనిపించదు

మన మధ్యే తిరుగుతున్న ఓ సామాన్య యువకుడిలా కనిపిస్తాడు

ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి గుండెను తనకు అమర్చడంతో కుటుంబ సభ్యులు అందరూ అతడికి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు

ఆ ఫీల్ ఎక్కడా చెడకుండా మోహన్ లాల్ చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్ చేసారు

హరిత గా నటించిన మాళవిక మోహన్ నటన నాచురల్ గా ఉంది

కామెడీ ట్రాక్ కోసం జెర్రీ గా సంగీత్ ప్రతాప్ , సందీప్ బావ పాత్ర పోషించిన సిద్దిఖీ లను తీసుకున్నారు
కామెడీ ట్రాక్ మరీ ఓవర్ కాకుండా జాగ్రత్తగానే మేనేజ్ చేసాడు దర్శకుడు

పాటలు , సెకండాఫ్ లో వచ్చే మెలో డ్రామా సినిమాని కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది

రొటీన్ సినిమాల్లో ఉన్నంత వేగవంతమైన స్క్రీన్ ప్లే ఈ సినిమాలో ఉండదు
స్లోగా సాగుతుంది

అయితే ఫ్యామిలీతో కలిసి సినిమా చూసే ప్రేక్షకులకు అదేమంత బోర్ కలిగించదు

కథలోకి , కధనంలోకి వెళ్ళినప్పుడు ఓ ఫీల్ గుడ్ సినిమా చూస్తున్నామన్న అనుభూతిని కలిగిస్తుంది
హృదయ పూర్వం ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది

నటీనటులు : మోహన్ లాల్ , మాళవిక మోహన్ , సంగీత్ ప్రతాప్ , సిద్దిఖీ
దర్శకత్వం :సత్యన్ అంతికాడ్
రేటింగ్ : 3 / 5

పరేష్ తుర్లపాటి


Spread the love

One thought on “ఫ్యామిలీ అంతా కలిసి ఓ మాంచి ఫీల్ గుడ్ సినిమా చూద్దామనుకుంటున్నారా ? అయితే హృదయపూర్వం చూసేయండి !

  1. Blockbuster avalante చెవులు చిల్లుపడే BGM li, cinema antha narukkovatalu, kalchukovatalu and గుండెలు adore dialogues undali.. eg.. KGF, Pushpa kalki and లేటెస్ట్ OG… Feel good సినిమాలు నిజంగా మనసుకు హాయినిస్తాయి. ఇది గొప్ప సినిమా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *