నిన్న రాత్రి ఇండియా .. పాకిస్తాన్ ల మధ్య ఉత్కంఠంగా జరిగిన ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో భారత్ విజయం సాధించింది
ఈ మ్యాచ్ లో భారత్ పాక్ ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది
తొలుత పాకిస్తాన్ బ్యాటింగ్ చేసి 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది
అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 18. 5 ఓవర్లలో నాలుగు వికెట్లు నస్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది
39 బంతుల్లో ఆరు ఫోర్లు , ఐదు సిక్సులు బాది 74 పరుగులు సాధించిన అభిషేక్ శర్మ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించారు
పహాల్గమ్ , ఆపరేషన్ సింధూర ల నేపథ్యంలో ఈసారి ఆసియా కప్ లో భారత్ , పాక ల మధ్య ఆదినుంచి ఉద్రిక్తతలు నెలకొన్నాయి
ఆసియ కప్ లో భారత్ , పాక్ ఆటగాళ్ల మధ్య షేక్ హ్యాండ్ వివాదంతో మొదలైంది
తర్వాత భారత్ ను యెగతాళి చేస్తూ పాక్ ఆటగాళ్లు మైదానంలో పహాల్గమ్ దాడులను అనుకరిస్తూ బ్యాట్ ను ఏకే 47 గన్ మాదిరి పట్టుకుని కాల్పులు జరుపుతున్నట్టు ఒకడు ఎగతాళి చేయగా , ఆపరేషన్ సింధూర లో భారత్ కు చెందిన ఆరు యుద్ధ విమానాలను నేల కూల్చామని ఇంకొకడు మైదానంలోనే సైగలు చేయడంతో ఇరు జట్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి
ఈ పరిస్థితుల్లో ఆదివారం రాత్రి ఇండియా , పాకిస్తాన్ ల మధ్య ఆసియా కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ జరగడంతో ప్రపంచం దృష్టి అంతా ఈ మ్యాచ్ మీదే కేంద్రీకృతం అయ్యింది
నరాలు తెగిపోయే ఉత్కంఠతల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ పాక్ మీద గెలిచి ఆసియా కప్ ను సొంతం చేసుకుంది
ఇదిలా ఉండగా
ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ హోదాలో ఉన్న పాకిస్తాన్ అంతర్గత మంత్రి మొహిసిన్ నఖ్వీ నుంచి కప్ ను తీసుకోవడానికి భారత్ ఆటగాళ్లు నిరాకరించడంతో మైదానంలో 90 నిమిషాల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది
పాకిస్తాన్ కు సరైన బుద్ది చెప్పిన భారత్ ఆటగాళ్ల తీరును పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు
పరేష్ తుర్లపాటి
