నేను తాగి న్యూసెన్స్ చేస్తానేమో అనుకుని ఆ హీరో తన కొడుకు పెళ్ళికి నన్ను పిలవలేదు -జగపతి బాబు
కెరీర్ మొదట్లో ఫ్యామిలీ హీరోగా ఒక వెలుగు వెలిగి విలన్ గా సెటిలైపోయిన జగపతిబాబు తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తూ విజయవంతమైన ఎపిసోడ్స్ నడిపిస్తున్నారు
ఆయన తన టాక్ షో మొదటి ఎపిసోడ్ అక్కినేని నాగార్జునతో మొదలుపెట్టాడు
జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షో స్పెషాలిటీ ఏంటంటే అన్ని విషయాలు దాపరికం లేకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం
ఈ విషయంలో జగపతి బాబు టాక్ షోని మంచి గ్రిప్పింగ్ గా నడిపిస్తున్నారు
నాగార్జునతో టాక్ షో జరుగుతుండగానే నాగ సుశీల కూడా వచ్చారు
ఆమె రావడంతో జగపతిబాబు తానూ , నాగార్జున కలిసి గతంలో చేసిన అల్లరిని గుర్తు చేసుకున్నారు
“ఒకసారి ఇలాగే తాగి న్యూసెన్స్ చేసానని మీ సిస్టర్ నాగ సుశీల వార్నింగ్ ఇస్తున్నట్టు నా వంక తీక్షణంగా చూసారు తెలుసా ?”అని నాగార్జున వంక చూసి నవ్వుతూ అడగటంతో నాగ సుశీల ఏం మాట్లాడకుండా నవ్వి ఊరుకుంది
అయినా జగపతి బాబు ఊరుకోకుండా నాగార్జున వంక చూస్తూ ‘ అందుకే నన్ను కొడుకు పెళ్ళికి కూడా పిలవలేదు కదా ?’ రెట్టించాడు
దాంతో నాగార్జున కంగారుగా “లేదు .. లేదు .. నిన్ను కూడా పెళ్ళికి పిలిచాం కదా “అని సంజాయిషీగా చెప్పడంతో ,
” ఆ .. అదే .. అదే .. పిలిచావులే ఒక రోజు ముందు ” అని జగపతిబాబు నవ్వుతూ సెటైర్ వేయడంతో అందరూ నవ్వుకున్నారు
