ఈ రోజు శనివారం కన్నప్ప టీజర్ 2 రిలీజ్ అయ్యింది
ఈ టీజర్లో మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు , మోహన్ లాల్ , ప్రభాస్ , శివ రాజ్ కుమార్ ,అక్షయ్ కుమార్ ,కాజల్ అగర్వాల్ తదితరులు కనిపిస్తారు
ఏ విధంగా అయితేనేమి పాన్ ఇండియా నటుల్ని కన్నప్ప లో కవర్ చేసారు
లుక్ పరంగా ప్రభాస్ ఆకట్టుకున్నాడు .. తరువాతి స్థానం మోహన్ బాబుకు దక్కుతుంది
శివుడి పాత్ర వేసిన అక్షయ్ కుమార్ లుక్ పెద్దగా నప్పలేదు
ఇక మళయాళ నటుడు మోహన్ లాల్ గెటప్ కూడా అంతంత మాత్రంగానే ఉంది
మంచు విష్ణు ప్రధాన పాత్రలో భారీ తారాగణంతో 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తున్న కన్నప్ప సినిమా రిలీజ్ డేట్ జూన్ 27 కు ఫిక్స్ చేసారు
టీజర్ 2 లో విష్ణు , మోహన్ బాబు , ప్రభాస్ ల డైలాగులు ఉన్నాయి
అలాగే బీజీఎం పరంగా కానీ విజువల్స్ పరంగా కానీ బావుంది
ఈ సినిమాకి దర్శకుడిగా ఎవరైతే బాగుంటుందో అని తండ్రిని సలహా అడిగితె మహా భారత్ సీరియల్ తీసిన ముకేశ్ కుమార్ సింగ్ పేరు సూచించారట మోహన్ బాబు
మంచు విష్ణు కెరీర్ లో బడ్జెట్ పరంగా కన్నప్ప భారీ సినిమా అవుతుంది
అయితే ఇంతమంది పాన్ ఇండియా స్టార్ల మధ్య మంచు విష్ణు ప్రధాన పాత్రలో ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి
ఓవరాల్ గా టీజర్ 2 లో ప్రభాస్ ఎంట్రీ అదిరింది !
పరేష్ తుర్లపాటి