కవిత మీద మాటల దాడి చేసింది మల్లన్న..మల్లన్న మీద చేతల దాడి చేసింది జనజాగృతి..మధ్యలో Where is BRS?

Spread the love

కవిత మీద మాటల దాడి చేసింది మల్లన్న

మల్లన్న మీద చేతల దాడి చేసింది జనజాగృతి

మధ్యలో Where is BRS?

గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే మెల్లిగా కవిత కూడా షర్మిల రూట్ లోనే వెళ్తున్నట్టు కనిపిస్తుంది

షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అన్న ఏపీ.. చెల్లి తెలంగాణాలో రాజకీయాలు చేస్తారు అని అనుకున్నారు అభిమానులు

మొదట్లో షర్మిల కూడా కుటుంబంలోని అంతర్గత విభేదాలను బయటపెట్టకుండా తెలంగాణాలో తన పార్టీని విస్తరించుకోవడానికి పాదయాత్రలు కూడా చేశారు

మరోపక్క ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి సీఎం పదవిలో కొనసాగుతున్నారు

తెలంగాణలో షర్మిల పార్టీ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేరుగా అన్న మీదే యుద్ధానికి దిగింది

దానితో అన్నాచెల్లెళ్ళ మధ్య ఆస్తి తగాదాల విషయం బయటికి వచ్చింది

ఇప్పటికీ ఆ వివాదం నడుస్తుంది

దరిమిలా చెల్లెలు ప్రభావం కొంత అయితేనేమి.. కూటమి బలపడటం కొంత అయితేనేమి ఏపీలో జగన్ ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాడు

చెల్లి కూడా ఏపీలో ఇంకో ప్రతిపక్ష పార్టీ నాయకురాలిగా అదే ఏపీలో తిరుగుతుంది

ఇదంతా ఏపీ స్టోరీ

కవిత విషయంలో ఈ ఏపీ స్టోరీ ఎందుకంటారా?

షర్మిలకు..కవితకు సిమిలారిటీస్ చాలా కనపడుతున్నాయి

అక్కడా చెల్లికి అన్నతో గ్యాప్ వచ్చింది

ఇక్కడా చెల్లికి అన్నతో గ్యాప్ వచ్చింది

షర్మిల కూడా మొదట్లో వైసీపీలో ఉంటూనే అసమ్మతి నాయకురాలిగా మారారు

కవిత కూడా పార్టీలో ఉండే అసమ్మతి నాయకురాలిగా మారుతున్నారు

అమెరికానుంచి వచ్చిన తర్వాత కవిత నుంచి పార్టీ నాయకుల మీద అసమ్మతి ఒకటొకటి బయటపడుతున్నాయి

అంతకుముందు డైరెక్ట్ గా కేసీఆర్ కే ఉత్తరం రాసి ఆయన్నే ప్రశ్నించి సంచలనం సృష్టించింది

అమెరికా నుంచి వచ్చిన తర్వాత దయ్యాలు.. దేవుడు అంటూ పార్టీలో నాయకులను విడగొట్టి విమర్శించింది

ఇక్కడ కవిత కూడా తనకు కేసీఆర్ నుంచి సానుభూతి లభిస్తుందని అనుకుంది

కానీ కథ ఇంకోలా మలుపు తిరిగింది

కేసీఆర్ నుంచి కవితకు వెంటనే పిలుపు రాలేదు

దానితో కేసీఆర్ మనసులో ఉద్దేశ్యం కవితకు అర్థమైపోయింది

వెంటనే తన రాజకీయ వ్యూహం మార్చుకుని జనజాగృతిని తిరిగి తెరపైకి తీసుకొచ్చింది

దానితో పాటు బీసీ నినాదం తలకెత్తుకుంది

మరోపక్క కవిత విషయంలో బిఆర్ఎస్ పార్టీ కానీ నాయకులు కానీ స్పందించడం మానేశారు

ఇదంతా కాకతాళీయకంగా జరుగుతుంది కాదు

పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతుంది

అయితే ప్రస్తుతానికి పూర్తిగా బయటపడకుండా ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు

అయితే ఇటీవల కవితను ఉద్దేశిస్తూ మరో ఎమ్మెల్సీ మల్లన్న చేసిన వాఖ్యలు దుమారం లేపిన నేపథ్యంలో జనజాగృతి కార్యకర్తలు మల్లన్న కార్యాలయం మీద దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేశారు

కవిత కూడా శాసన మండలి చైర్మన్ ను కలిసి మల్లన్న ను సస్పెండ్ చెయ్యాలని వినతి పత్రం ఇచ్చింది

ఈ మొత్తం ఎపిసోడ్ లో కవిత వెంట బిఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరూ లేరు

కనీసం పార్టీ తరపున ప్రెస్ మీట్ పెట్టి తమ పార్టీ ఎమ్మెల్సీ కవిత మీద మల్లన్న చేసిన వాఖ్యలు ఖండించలేదు

ఈ పరిణామాలు క్రమంగా బిఆర్ఎస్ పార్టీలో కవిత ఒంటరి అవుతున్నారని తెలియచేస్తుంది

పార్టీకి ఆమెకు గ్యాప్ సృష్టంగా కనిపిస్తుంది

ఈ పరిస్థితుల్లో కవిత సొంతంగా పార్టీ పెడితే ఏమౌతుంది?

ఏమీ అవదు

ఏపీలో షర్మిల పరిస్థితే అవుతుంది

వైఎస్సార్ ఇమేజ్.. ధనబలం పుష్కలంగా ఉన్న షర్మిల కూడా తెలంగాణాలో పార్టీ పెట్టి విఫల ప్రయోగం చేసింది

కేసీఆర్ పేరు లేకుండా.. బిఆర్ఎస్ జెండా లేకుండా కవిత సొంతంగా నెగ్గుకు రావడం చాలా కష్టం!

పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!