సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు గారికి ఏమైంది ? ప్రస్తుతం బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి .. ఆ ఫోటోల్లో కోట శ్రీనివాస రావు కాలికి కట్టుతో గుర్తుపట్టలేనంతగా చిక్కిపోయారు .. బండ్ల గణేష్ ట్వీట్ చేసేవరకు చాలామందికి ఆయన అనారోగ్యం గురించి తెలీదు
నటుడిగా , కమెడియన్ గా , విలన్ గా షుమారు 750 కి పైగా చిత్రాల్లో నటించి ఉత్తమ నటనకు గాను ఏకంగా తొమ్మిది నంది అవార్డులు సొంతం చేసుకున్నారు కోట శ్రీనివాస రావు
తెలంగాణా రాకముందే సినిమాల్లో తెలంగాణా యాసలో డైలాగులు పండించి అందరి మెప్పు పొందారు
1999 నుంచి 2004 వరకు ఏపీలోని విజయవాడ తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు
2023 లో చివరిసారిగా సువర్ణ సుందరి సినిమాలో కనిపించారు కోట
మధ్యలో కొడుకు మరణంతో మానసికంగా కుంగిపోయి సినిమాలు చాలావరకు తగ్గించేసుకున్నారు
అప్పట్నుంచి ఆయన ఇంటిపట్టునే ఉంటున్నారు
చిన్నా చితకా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మరీ ఇంతలా గుర్తుపట్టలేనంత గా మారిపోలేదు
ఇప్పుడు బండ్ల గణేష్ ట్వీట్ తో కోట శ్రీనివాస రావు ఆరోగ్యం పట్ల ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు
గతంలో ప్రముఖ దర్శకుడు కె విశ్వనాధ్ గారికి ఒంట్లో బాగోకపోతే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విశ్వనాధ్ ఇంటికెళ్లి పరామర్శించారు
కోట శ్రీనివాస రావు అనారోగ్యం ఫోటోలు నెట్టింట వైరల్ అయినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వ పెద్దలు స్పందించినట్టు లేదు
ముఖ్యమంత్రికి వీలుకాకపోతే కనీసం రాష్ట్ర మంత్రి అయినా కోటను పరామర్శించి తగిన వైద్య సదుపాయాలు కలిపించి ఉండాల్సిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు కోట ఆరోగ్య విషయంలో వెంటనే స్పందిస్తే బాగుంటుంది !
పరేష్ తుర్లపాటి