సూపర్ స్టార్ కృష్ణ.. విజయ నిర్మల పెళ్లి చేసుకోవడం వెనుక ఆ ఇద్దరు సినీ నటులు ఉన్నారా ?

Spread the love

సూపర్ స్టార్ కృష్ణ.. విజయ నిర్మల పెళ్లి చేసుకోవడం వెనుక ఆ ఇద్దరు సినీ నటులు ఉన్నారా ?

సినీ పరిశ్రమలో రెండు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ కృష్ణ .. విజయనిర్మల దాంపత్యం అన్యోన్యంగా కడ దాకా సాగింది

వీరిద్దరి ప్రేమ వివాహం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది

కృష్ణ .. విజయ నిర్మల ప్రేమ , పెళ్లి వెనుక ఉన్న చిన్న నేపధ్యాన్ని సీనియర్ దర్శకుడు హరిశ్చంద్ర రావు గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు

వారి ప్రేమ వివాహం వెనుక కమెడియన్ రాజబాబు జ్యోస్యం ఉందని ఆయన చెప్పారు

కృష్ణకు 1961 లో తన మరదలు ఇందిరతో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది

పెళ్ళైన ఆరేళ్లకు విజయ నిర్మల సరసన సాక్షి సినిమాలో నటించారు కృష్ణ

ఆ సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది

కానీ అప్పటికే విజయనిర్మలకు వేరే వ్యక్తితో పెళ్లయి నరేష్ జన్మించాడు

ఇదిలా ఉండగా సాక్షి సినిమా క్లైమాక్స్ సన్నివేశం మీసాల కృష్ణుడు టెంపుల్ లో జరిగింది

ఈ సినిమాకి బాపు దర్శకుడు

క్లైమాక్స్ లో అమ్మ కడుపు చల్లన అనే పాట చిత్రీకరణలో భాగంగా కృష్ణ విజయ నిర్మలను పెళ్లి చేసుకునే సన్నివేశం చిత్రీకరిస్తున్నారు బాపు గారు

బాపు సినిమాల్లో పెళ్లిళ్లు నిజం పెళ్లిళ్ల మాదిరి సాంప్రదాయ బద్దంగా ఉంటాయి

షూటింగ్ ముగించుకుని కృష్ణ విజయ నిర్మల పెళ్లి బట్టలతో గుడి నుంచి బయటికి వచ్చారు

పెళ్లి బట్టల్లో వీళ్ళిద్దరినీ చూసిన కమెడియన్ రాజబాబు ‘ ఈ దేవాలయానికి వచ్చిన జంటలకు రియల్ లైఫ్ లో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుందని జ్యోష్యం చెప్పారట .. మీరిద్దరూ జంటగా రావడంతో పాటు పెళ్లి సీన్ లో కూడా నటించారు కాబట్టి త్వరలో మీకిద్దరికీ కూడా పెళ్లి కావడం ఖాయం ‘ అని బల్లగుద్ది మరీ చెప్పారట

అయితే అప్పటికే ఇద్దరికీ పెళ్లిళ్లు అవడంతో ఈ విషయం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు

కానీ రాజబాబు ఏ ముహూర్తాన అన్నాడో కానీ విజయ నిర్మల ఆ రోజు నుంచే సూపర్ స్టార్ కృష్ణను ప్రేమించడం మొదలుపెట్టింది

కృష్ణ కూడా విజయ నిర్మల ప్రేమలో పడ్డాడు

సినిమాల్లో అవకాశాల కోసం విజయ నిర్మల అప్పటికే భర్తతో విడిపోయింది

అలా రెండేళ్ల పాటు వీరి ప్రేమ కొనసాగింది

ఇదిలా ఉండగా తదనంతర కాలంలో కృష్ణ .. విజయ నిర్మలల పెళ్లి తానే దగ్గరుండి జరిపించినట్టు మరో సీనియర్ నటుడు చంద్రమోహన్ అప్పట్లో మరొక ఇంటర్వ్యూలో చెప్పారు

ఆ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ చెప్పిన విశేషాలు

కృష్ణ .. విజయనిర్మల లు ప్రేమించుకుంటున్నారని ఇండస్ట్రీలో అతి కొద్దిమందికే తెలుసు

అయితే అప్పటికే వారిద్దరి మధ్య దూరం పెంచాలని కొంతమంది ప్రయత్నించారు

కృష్ణ గారు ఇందిరకు విడాకులు ఇచ్చి విజయ నిర్మలను పెళ్లి చేసుకుందాం అనుకున్నారు

కానీ కృష్ణ గారికి విడాకులు ఇవ్వడానికి ఇందిర ఒప్పుకోలేదు

దాంతో కృష్ణ గారు ఆమెకు విడాకులు ఇవ్వకుండానే విజయ నిర్మలను వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు

దానితో 1969 లో నేను , ఓ ఫిలిం జర్నలిస్ట్ , విజయ నిర్మల గారి అసిస్టెంట్ , కృష్ణగారి మేకప్ మ్యాన్ మొత్తం నలుగురం వెళ్లి తిరుపతిలో వారి పెళ్లి దగ్గరుండి జరిపించాం అని చెప్పారు

ఏదిఏమైనా సూపర్ స్టార్ కృష్ణ .. విజయ నిర్మలలు ప్రేమ వివాహం చేసుకుని జీవితాంతం అన్యోన్యంగా కడ దాకా కలిసి ఉన్నారు

వీరిద్దరికీ అప్పటికే మొదటి భార్య , మొదటి భర్త ద్వారా పిల్లలు ఉండటంతో ఇక పిల్లలు వద్దనుకున్నారు

కృష్ణ గారు విజయ నిర్మలను పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్య ఇందిర కు ఎటువంటి లోటు చేయలేదు

అలా కృష్ణ .. విజయ నిర్మల ల ప్రేమ పెళ్లిళ్ల వెనుక ఇద్దరు నటులకు అనుభవాలు ఉన్నాయని ఇంటర్వ్యూల ద్వారా తెలిసింది !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!