Home » ఫిలిం జర్నలిస్ట్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురవడంతో ఆగ్రహంతో ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ చేసిన మంచు లక్ష్మి – ఇంతకీ ఆ జర్నలిస్ట్ అడిగిన’ గ్రేట్ ‘ ప్రశ్న ఏంటి ?

ఫిలిం జర్నలిస్ట్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురవడంతో ఆగ్రహంతో ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ చేసిన మంచు లక్ష్మి – ఇంతకీ ఆ జర్నలిస్ట్ అడిగిన’ గ్రేట్ ‘ ప్రశ్న ఏంటి ?

Spread the love

ఫిలిం జర్నలిస్ట్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురవడంతో ఆగ్రహంతో ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ చేసిన మంచు లక్ష్మి – ఇంతకీ ఆ జర్నలిస్ట్ అడిగిన’ గ్రేట్ ‘ ప్రశ్న ఏంటి ?

మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ఓ ఫిలిం జర్నలిస్ట్ పై ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసారు

ఆమె దక్ష సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫిలిం జర్నలిస్టులకు ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు

అలాగే గ్రేట్ ఆంధ్ర యూ ట్యూబ్ జర్నలిస్ట్ వి ఎస్ ఎన్ మూర్తికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది

వివాదం గురించి మంచు లక్ష్మి చెప్తూ ‘ఈ ఇంటర్వ్యూలో సదరు జర్నలిస్ట్ తన సినిమా గురించి కాకుండా తన వ్యక్తిత్వం గురించి ప్రశ్నలు అడగటం తనను అవమానించినట్టు చెప్పారు

“50 ఏళ్లకు దగ్గరగా ఉన్న మీరు ఇంకా ఇటువంటి దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారు ?” అని ఆ జర్నలిస్ట్ ప్రశ్నించడంతో చాలా బాధ వేసింది అని ఆమె అన్నారు

వెంటనే ” మహేష్ బాబుకి కూడా 50 వస్తున్నాయ్ .. ఆయన చొక్కా విప్పుకు తిరిగితే ఇదే ప్రశ్న వేయగలరా ? ఆడవాళ్ళని ఇలాంటి ప్రశ్నలు అడగడం జర్నలిజం అనిపించుకోదు .. అవమానకరం ” అంటూ ఎదురు ప్రశ్నించినట్టు ఆమె చెప్పారు

మంచు లక్ష్మి ఈ విషయాన్ని అంతటితో వదిలేయలేదు

ఆ జర్నలిస్ట్ మీద నేరుగా ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేసింది

ఫిలిం ఛాంబర్ కు ఇచ్చిన ఫిర్యాదు లేఖలో ‘ నాలుగు సంవత్సరాల తర్వాత మా తండ్రి గారు అయిన మోహన్ బాబు గారితో కలిసి నటించిన సినిమా ప్రమోషన్లో భాగంగా సదరు జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది . కానీ ఆయన సినిమా గురించి కాకుండా నా వయసు , శరీరం , దుస్తులు అంటూ కించపరిచే ప్రశ్నలు వేసాడు . నన్ను కించపరచడం ద్వారా ఇంటర్వ్యూ వైరల్ అవుతుందని అలా ప్రవర్తించడం బాధాకరం . మహిళల వ్యక్తిత్వాన్ని ఫణంగా పెట్టే ఇలాంటి ప్రశ్నలు వేయడం జర్నలిజం అనిపించుకోదు . కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఆ జర్నలిస్టు చేత క్షమాపణలు చెప్పించాలని పేర్కొన్నారు

సదరు జర్నలిస్ట్ క్షమాపణ చెప్పకపోతే ఆయనపై మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తానని మంచు లక్ష్మి చెప్పారు

ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచు లక్ష్మి వివాదం సెగలు పుట్టిస్తుంది !


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *