‘మయసభలో’ వైయస్సార్ , చంద్రబాబు , వంగవీటి , పరిటాలతో సహా అందరూ ఉన్నారు సరే అసలు స్టోరీ అదేనా?

Spread the love

‘మయసభలో’ వైయస్సార్ , చంద్రబాబు , వంగవీటి , పరిటాలతో సహా అందరూ ఉన్నారు సరే అసలు స్టోరీ అదేనా?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబుల జీవితాల ఆధారంగా దేవ్ కట్టా , కిరణ్ జయ కుమార్ లు తెరకెక్కించిన మయసభ వెబ్ సిరీస్ ప్రస్తుతం సోని లివ్ ఓటిటి లో స్ట్రీమ్ అవుతుంది

తెలుగు రాష్ట్రానికి చెందిన ఇద్దరు పొలిటికల్ లెజెండ్స్ జీవిత కథ ఆధారంగా తీసిన సిరీస్ కాబట్టి మయసభకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది

రాజకీయాల్లోకి రాకముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి .. నారా చంద్రబాబు నాయుడులు మంచి స్నేహితులు అన్న విషయం నేటి జెనెరేషన్ కు పెద్దగా తెలియకపోవచ్చును కానీ నాటి సమకాలికులకు పూర్తిగా తెలుసు

వారిద్దరి మధ్య స్నేహాన్ని ఎలివేట్ చేసేందుకే దేవ్ కట్టా మొదటి భాగంలో ఎక్కువ శ్రద్ద పెట్టాడు

కాకర్ల కృష్ణమ నాయుడు పేరుతొ చంద్రబాబు పాత్రను ఆది పినిశెట్టి పోషించగా , ఎంఎస్ రామిరెడ్డి పేరుతొ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను చైతన్య రావ్ పోషించాడు

కధేంటి ?

ఎపిసోడ్ మొదటి భాగాల్లో వీరిద్దరి కాలేజీ చదువుల నేపథ్యంలో సాగుతుంది

కృష్ణమ నాయుడిని వ్యవసాయంలో భాగం చెయ్యాలని ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించగా , ఫ్యాక్షన్ రాజకీయాల్లోకి కొడుకుని దింపాలని రామిరెడ్డి తండ్రి ప్రయత్నిస్తుంటాడు

కానీ ఇద్దరి లక్ష్యాలు వేరుగా ఉంటాయి

బాగా చదువుకుని సమాజాన్ని బాగు చేయాలనీ కృష్ణమ నాయుడు భావించగా , డాక్టర్ చదువుకుని పేదలకు సేవ చేయాలనీ రామిరెడ్డి అనుకుంటాడు

వేరు వేరు భావజాలాల్లో ఉన్న ఈ ఇద్దరు అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారు

రాజకీయాల్లో వీరిద్దరికీ ఎదురైన అనుభవాలేంటి ?

చదువుకునే రోజుల్లో స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్థులుగా ఎలా మారారు ? అన్న పాయింట్ల ఆధారంగా దేవ్ కట్టా మయసభను నడిపించాడు

సిరీస్ ఎలా ఉంది ?

ప్రజాజీవితంలో ఉన్న ఇద్దరు పొలిటికల్ లెజెండ్స్ జీవితాల ఆధారంగా దర్శకుడు కథను అల్లుకున్నాడు కాబట్టి పొలిటికల్ కారిడార్ లో ఈ సిరీస్ కొంత క్యూరియాసిటీని రేకెత్తించింది

అయితే కథ పరంగా కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలి కాబట్టి మయసభ వారిద్దరి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన సిరీస్ అని దర్శకుడు బహిరంగంగా చెప్పకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు

కధలో కొంత కల్పితం కూడా జోడించామని చెప్పారు కాబట్టి మక్కికి మక్కిగా వారిద్దరి జీవితాలకు సంబందించిన విషయాలు ఇందులో కనపడవు

అందుకే నిజ జీవితాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి , చంద్రబాబుల స్నేహాల విషయంలో కొన్ని అపశృతులు దొర్లినా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు

ఇద్దరు నేతల మధ్య స్నేహం , రాజకీయ శత్రుత్వం , కులాలు అనే పాయింట్లు ప్రధానంగా బేస్ చేసుకుని కధనాన్ని అల్లుకున్నట్టున్నాడు దర్శకుడు

అందుకే కులాల వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపే ప్రయత్నంలో భాగంగా విజయవాడలో వంగవీటి మోహన రంగా హత్యోదంతాన్ని కూడా టచ్ చేసాడు

వెబ్ సిరీస్ కాబట్టి సెన్సార్ ఇబ్బందులు కూడా పెద్దగా ఎదురవలేదు అనుకుంటా కులాల గురించి మయసభలో ఓపెన్ గానే డిస్కస్ చేసాడు దేవ్ కట్టా

ఎవరెలా చేసారు ?

చంద్రబాబు పాత్ర పోషించిన ఆది పినిశెట్టి గ్రౌండ్ వర్క్ బాగా చేసినట్టున్నాడు .. చంద్రబాబు మేనరిజాన్ని బానే ప్రదర్శించాడు.. బాడీ లాంగ్వేజ్ లోనూ , యాసను పలకడంలోనూ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడు

ఇక వైఎస్సార్ పాత్ర పోషించిన చైతన్య రావు కూడా చక్కటి నటనను ప్రదర్శించాడు

ఎన్టీఆర్ పాత్రను సాయి కుమార్ పోషించాడు

నాజర్ , శ్రీకాంత్ అయ్యర్ , , దివ్య దత్తా , తదితరులు ఇతర పాత్రల్లో నటించారు

ప్రధాని ఐరావతి బసు పేరుతొ ఇందిరాగాంధీ పాత్రలో దివ్య దత్తా బాగా చేసారు

మొదటి తొమ్మిది భాగాల సిరీస్ లో వైఎస్సార్ , చంద్రబాబుల స్నేహాన్ని ప్రధాన అంశంగా తీసుకున్న దర్శకుడు దేవ్ కట్టా రాజకీయాల్లో వారిద్దరి మధ్య శత్రుత్వాన్ని కూడా చూపించబోతున్నాడని సిరీస్ ఆఖర్లో రామిరెడ్డి ‘ ఇక నీకూ .. నాకూ మధ్యే యుద్ధం ‘ అన్న డైలాగ్ పలికించడం ద్వారా చెప్పాడు

రేటింగ్ 3 / 5
పరేష్ తుర్లపాటి


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!