ఐసీయూ బెడ్ మీదనుంచే ఆఖరి డబ్బింగ్ చెప్పిన అక్కినేని .. అసలు విషయం చెప్తూ కంట తడి పెట్టిన నాగార్జున !
హీరోగా , విలన్ గా , క్యారక్టర్ నటుడిగా మెప్పించిన జగపతి బాబు ఇప్పుడు జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోతో బుల్లి తెరపై కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు
ఈ మధ్య బుల్లి తెర టాక్ షోలకు వ్యూయర్షిప్ బాగా పెరిగిందనే విషయం అందరికీ తెలిసిందే
బుల్లి తెరపై బాలయ్య హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో కూడా పాపులర్ అయ్యింది
ఇప్పుడు అదే ప్రయత్నం జగపతి బాబు చేస్తున్నారు
ప్రోమో చూస్తుంటే జగపతి బాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంటుంది అనిపిస్తుంది
తాజాగా జగపతిబాబు ఇటీవల కూలీలో నెగిటివ్ పాత్ర పోషించిన నాగార్జునతో టాక్ షో నిర్వహించారు
ఈ టాక్ షోలో ఏఎన్నార్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నాగార్జున కంట తడి పెట్టారు
మనం సినిమా షూటింగ్ సమయంలో ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఇంటివద్ద ఏర్పాటు చేసిన ఐసీయూ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు
అయితే ఆ సమయంలో ఆయన తనని పిలిచి ఈ సినిమాకి తన పాత్రకు వేరేవారితో డబ్బింగ్ చెప్పించవద్దని తానే మొత్తం డబ్బింగ్ పూర్తి చేస్తానని కోరారు
కానీ అప్పుడు ఆయనున్న పరిస్థితుల్లో స్ట్రెయిన్ అవడం మంచిది కాదని డాక్టర్లు చెప్పారు
అదే విషయం నాన్నతో చెప్తే అలా చేస్తే అస్సలు ఊరుకునేది లేదని అన్నారు
కళాకారుడిగానే పుట్టాను .. కళాకారుడిగానే మరణిస్తాను అనడంతో చేసేదిలేక డబ్బింగ్ మొత్తం ఆయన బెడ్ మీదనుంచే చెప్పించి పూర్తి చేసాం
తన జీవితంలో ఎప్పుడూ ఇంత వత్తిడి పడలేదనీ , నిద్ర లేని రాత్రులు గడిపానని నాగార్జున చెప్పారు
అప్పటికే డాక్టర్లు ఆయన మరణానికి దగ్గరగా ఉన్నారని చెప్పడంతో మనం సినిమా పూర్తి అయ్యేలోపు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని టెన్షన్ పడ్డానని అయన చెప్పారు
చూస్తుండగానే షూటింగ్ పూర్తి కావడంతో నాన్నకు సినిమా చూపిస్తే చాలా బాగుందిరా అని మెచ్చుకున్నారు
మొదట్లో నన్ను సినిమాల్లో నటించాలని ప్రోత్సహించింది అన్నయ్యే
ఆయనే నాన్న దగ్గరికి తీసుకెళ్లి నేను సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్టు చెబితే నాన్న కళ్ళలో సుడులు తిరిగిన కన్నీరు నాకు ఇప్పటికీ గుర్తే
నేను నటించిన అన్నమయ్య సినిమా చూసి నాన్న నా రెండు చేతులూ పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు అని చెబుతూ నాగార్జున ఎమోషనల్ అయి కంట తడి పెట్టారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రోమో వైరల్ అవుతుంది !