- B T Govinda Reddy
 
అనాదిగా మగాడికి పొట్ట , బట్ట (బట్ట తల ) పెద్ద మనాది అయి కూర్చుంది
పొట్ట అయినా యేవో కొన్ని వ్యాయామాలు , సరైన డైటు తీసుకుంటే తగ్గుతుందేమో కానీ ఎన్ని ఆయిల్స్ రాసినా ఇప్పటివరకు ఎవరికీ బట్ట తల మీద వెంట్రుకలు మొలవడం జరగలేదు
మారిన జీవన శైలి , ఆహారపు అలవాట్ల దృష్ట్యా ప్రస్తుతం యువకులు కూడా బట్ట తల బారిన పడుతున్నారు
గతంలో 60 దాటితే వచ్చే బట్ట తల ఇప్పుడు ముప్పై , నలభై ఏళ్లకే చాలామందిలో కనిపిస్తుంది
దాంతో చాలామంది యువకులు ఆత్మా న్యూనతతో బాధపడుతున్నారు
దీనితో మార్కెట్లో దొరికే రకరకాల ఆయిల్స్ వాడి జుట్టు మొలవక భంగ పడుతున్నారు
ఇదే అదనుగా మార్కెట్లో నకిలీ హెయిర్ ఆయిల్స్ అమ్మే వాళ్ళు రంగంలోకి దిగి సొమ్ము చేసుకుంటున్నారు
ఆ మధ్య హైద్రాబాదులో బట్ట తలపై వెంట్రుకలు మొలిపిస్తామంటూ ఓ హెయిర్ ఆయిల్ తయారీదారులు 200 ml బాటిల్ ఒక్కటి మూడు వేల ధర పెడితే యువకులు ఎగబడి క్యూలలో నిలబడి మరీ కొనుక్కున్నారు
వాడిన తర్వాత తాము మోసపోయామని తెలుసుకున్నారు
అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేరిట ఖరీదైన క్లినిక్ సెంటర్లు వెలుస్తున్నాయి
వీటిలో జుట్టు మొలిపించేందుకు లక్షల్లో వసూలు చేస్తున్నారు
ఆలా రకరకాల ప్రయోగాలు చేసిన తర్వాత కూడా బట్ట తల మీద జుట్టు మొలవక విసిగిపోయిన వారికి శుభవార్త
కుమిలిపోయే వేదనకు ఐదేళ్లలో పరిష్కారం
ప్రపంచంలోని పురుషులందరినీ ఆత్మవిశ్వాసంతో తలెత్తుకునేలా చేసే మందును యూనివర్సిటీ ఆఫ్ క్యాలిపోర్నియా(UCLA) పరిశోధకులు అభివృద్ధి చేసారు.
PP405 అనే సాంకేతిక నామంతో పిలుస్తున్న ఈ పైపూత మందు నిద్రాణంలోకి జారిపోయిన జుట్టు వేర్లను మళ్లీ ఉత్తేజితంచేస్తాయి.
రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో 100 మందికి ఈ ద్రవ పదార్థాన్ని పూయగా అందరికీ వెంట్రుకలు తిరిగి మొలిచాయి.
2026 లో అమెరికా FDA అప్రూవల్ పొందితే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది. ఇండియాలో అందరికీ అందుబాటులో ఉండే ఖర్చుతో దొరకాలంటే మరో ఐదేళ్లు పట్టొచ్చు
