ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని కనిపిస్తే ప్రజలు ఊరుకుంటారా ?
ఆదివారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో పవన్ కళ్యాణ్ నటించిన OG మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది
సరిగ్గా ఈవెంట్ ప్రారంభం అవుతుందనగా కుండపోతగా వర్షం మొదలైంది
అప్పటికీ స్టేడియం పవన్ అభిమానులతో నిండిపోయింది
వర్షం కురుస్తున్నా అభిమానులు లెక్కచేయకుండా పవర్ స్టార్ , పవర్ స్టార్ అని నినాదాలు చేస్తూనే ఉన్నారు
ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సరికొత్త ఆటిట్యూడ్ తో కనిపించాడు
అదేంటో చిన్న విశ్లేషణ చేసుకుందాం
సాధారణంగా పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ల లో ఇన్వాల్వ్ అవడం తక్కువ
మొదటిసారిగా హరిహర వీరమల్లు సినిమాతో పవన్ సినిమా ప్రమోషన్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి పని చేసాడు
ఇప్పుడు OG మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నీ తానే అయి నడిపించాడు
మాములుగా పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్ అంటే అభిమానుల్లో ఫుల్ జోష్ ఉంటుంది
కానీ ఈ ఈవెంట్లో అభిమానుల్లో కన్నా పవన్ లోనే ఫుల్ జోష్ కనిపించింది
OG మూవీలోని గ్యాంగ్ స్టర్ గెటప్ లోనే చేతిలో కత్తి పట్టుకుని దూకుడుగా స్టేజి మొత్తం కలియతిరిగాడు
కత్తి చేతితో తిప్పుతూ ‘ ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి తిప్పితే ప్రజలు ఊరుకుంటారా ? ‘ అని నవ్వుతూ తన మీదే సెటైర్ వేసుకున్నాడు పవన్ కళ్యాణ్
కానీ ఒక సినీ నటుడిగా కత్తి పట్టుకోక తప్పలేదు . ఈ ఫంక్షన్ కి OG గెటప్ లోనే వస్తే బాగుంటుందని దర్శకుడు సుజిత్ చెప్పడంతో సినిమా గెటప్ తోనే రావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు
ఈ ఈవెంట్ లో మొదటిసారి అభిమానులు పవర్ స్టార్ లోని కొత్త కోణం చూసారు
పవన్ కళ్యాణ్ దర్శకుల మాట కన్నా తనకు నచ్చిన విధంగా సినిమా ఉండాలని చిత్ర నిర్మాణంలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకునేవాడని గతంలో కొంత టాక్ ఉండేది
కానీ OG విషయంలో దర్శకుడు సుజిత్ ఏది చెప్తే అది మారుమాట్లాడకుండా చేసానని ఈవెంట్లో పవనే స్వయంగా చెప్పాడు
చెప్పడమే కాదు ఈవెంట్ ఆసాంతం సుజిత్ , సుజిత్ అంటూ దర్శకుడి నామ జపం చేసారు
జానీ సినిమా సమయంలో ఈ సుజిత్ తన అభిమాని అని , తలకు బ్యాండ్ కట్టుకుని తన థియేటర్ల చుట్టూ తిరిగేవాడని చెప్పారు
ఈ సినిమా కోసం సుజిత్ తక్కువ మాట్లాడి ఎక్కవ పని చేసాడని మెచ్చుకున్నారు
అందుకే నేను ఈ సినిమాని ఎంతగానో ప్రేమిస్తున్నాను అని ఎమోషన్ అయ్యారు పవన్
ఈ సినిమా మీద పవన్ కళ్యాణ్ భారీ అంచనాలతో ఉన్నారని స్టేడియంలో ఆయన తీరు చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది
జోరున వాన కురుస్తున్నా ఇంచు జరగని తన అభిమానులను చూస్తూ పవన్ కూడా ర్యాంప్ మీద నడుస్తూ ‘ ఈ వర్షం మనల్ని ఆపుతుందా ? ఈ వర్షం మనల్ని ఆపుతుందా ? అంటూ ఉత్సాహపరిచారు
అంతేకాదు హుషారుగా జపనీస్ భాషలో OG డైలాగులు చెప్పడంతో స్టేడియం మారుమోగిపోయింది
తాను రాజకీయాల్లోకి రావడం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ,
ఇంత చక్కటి యువ బృందం ఆనాడే నాకు దొరికుంటే నేను రాజకీయాల్లోకి కూడా వచ్చేవాడిని కాదేమో ? అని సినిమాలపై తనకున్న ప్యాషన్ ను బయటపెట్టుకున్నారు
ఈ మాటలు సినిమా మీద పవన్ కున్న నమ్మకాన్ని తెలియచేస్తుంది
మళ్ళీ వెనకటి పవర్ స్టార్ పవన్ లో ఆవహించినట్టు అనిపించింది
తాను సినిమాల్లో కంటిన్యూ అయి ఉంటే బాగుణ్ణు అనే ఆలోచన పవన్ లో మొదటిసారి వచ్చినట్టుంది
అందుకే తాను డిప్యూటీ సీఎం గా ప్రదర్శించే గంభీరతను పక్కనబెట్టి ఈవెంట్లో ఫుల్ జోష్ తో కనిపించారు
OG కనుక పవన్ అంచనాలకు తగినట్టుగా సూపర్ హిట్ అయితే మాత్రం రాజకీయాలా ? సినిమాలా ? అనే ఒక అంతర్మధనంలోకి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా వెళ్తారు
సెప్టెంబర్ 25 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన OG మూవీ వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది
పరేష్ తుర్లపాటి
