కుర్చీల్లో వరుసగా కూర్చున్నవాళ్లు లక్షలు కోట్లు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు
మధ్యలో సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న వ్యక్తి గతంలో ఈ నిర్మాతలు తీసిన సినిమాలకు యాబైయ్యో, వందో మూడొందలో పెట్టి మొదటిరోజు క్యూ లైన్లో నిలబడి టికెట్ కొనుక్కుని సినిమా చూసిన సాధారణ మనిషే
సినిమాలో హీరో పాత్రను ఇష్టపడి విలన్ పాత్రను ద్వేషించే అందరిలా సామాన్య ప్రేక్షకుడే
మూడు గంటల సినిమాలో కథ గురించి , పాత్రల గురించి కుటుంబ సభ్యులతోనో..స్నేహితులతోనో మూడు ముక్కలు ముచ్చటించిన సాధారణ ప్రేక్షకుడే
సినిమా మొదలౌతుండగానే ఆదరాబాదరాగా థియేటర్లో అడుగుపెట్టి మన పక్క సీట్లో కూర్చుని ‘ బొమ్మ పడి ఎంతసేపయ్యింది గురూ?’ అని క్యూరియాసిటీతో మనల్ని ప్రశ్నించే సామాన్య ప్రేక్షకుడే
అంతే
చాలామంది ప్రేక్షకుల పాత్ర అంతవరకే పరిమితం అవుతుంది
కానీ కొంతమంది మాత్రమే సినిమాల్లో చూపించినట్టు అదే ప్రేక్షకుల నుంచి నిజ జీవితంలో నాయకులుగా కూడా ఎదుగుతారు
గతంలో వంద రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కున్న అదే ప్రేక్షకుడు ఆ సినిమాల తాలుకూ నిర్మాతలను వరుసలో కూర్చోబెట్టి సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి రావాల్సిన వందల కోట్ల రూపాయల ఆదాయం గురించి చర్చించగలడు
టికెట్ రేట్లు పెంచుకోవడానికి వారికి అనుమతులూ ఇవ్వగలడు
కాలు మీద కాలేసుకుని కూర్చున్న BA చదివిన ఒక సాధారణ యువకుడి ముందు గొప్ప గొప్ప నిర్మాతలు సైతం బుద్ధిమంతుల్లా ఒద్దికగా కూర్చోవడం వెనక ఒకే ఒక బలమైన కారణం ఉంది
అదేంటో తెలుసా?
ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప తనం అదే
That is Power
పరేష్ తుర్లపాటి